Home » attacked
ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.
ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి పాదయాత్రను అడ్డుకుంటూనే ఉన్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.
విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు.
బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మాయలో పడిన ఓ బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది.
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ లో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి 15 మంది అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు.