Young Man Attacked : విజయవాడలో వివాహితపై యువకుడి వేధింపులు.. ఆపాలన్నందుకు అనుచరులతో కలిసి ఫ్యామిలీపై కత్తులతో దాడి

విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు.

Young Man Attacked : విజయవాడలో వివాహితపై యువకుడి వేధింపులు.. ఆపాలన్నందుకు అనుచరులతో కలిసి ఫ్యామిలీపై కత్తులతో దాడి

attacked

Updated On : February 13, 2023 / 6:58 AM IST

Young Man Attacked : విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దాడి చేసిన వారిలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వడ్దాది నరేష్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఓ వివాహితను వేధిస్తున్నాడు.

ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్నాళ్లూ మౌనంగా భరించిన ఆ వివాహిత విషయాన్ని తన భర్త, అత్త మామలకు చెప్పింది. దీంతో వారు నరేష్ ఇంటికి వెళ్లి నిలదీశారు. మరోసారి రిపీట్ అయితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే నరేష్ మాత్రం వారిని వార్నింగ్ ను ఏ మాత్రం లెక్కచేయలేదు. తన బ్యాచ్ ను వెంటేసుకుని వివాహిత ఇంటిపై దాడికి తెగబడ్డాడు. కత్తులతో కుటుంబ సభ్యులపై దాడి చేశాడు.

Men Molested Girl : నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేసిన శాడిస్టులు అరెస్ట్

ఈ దాడిలో వివాహిత మరిది, అత్తతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ దాడిలో నరేష్ తోపాటు అతని స్నేహితులు పవన్, లోకేశ్, రమణ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గత రెండు నెలలుగా వడ్డాది నరేష్, అతని తమ్ముడు రమణ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని
బాధితురాలు ఆరోపించింది. వారి వేధింపులు తీవ్రం రూపం దాల్చడంతో తమ కుటుంబసభ్యులకు చెప్పానని తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నరేష్ తన అనుచరులతో తన కుటుంబంపై కత్తులతో దాడి చేశారని వాపోయారు. నరేష్, అతని అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.