Tripura Former CM House Set On Fire : త్రిపుర మాజీ సీఎం ఇంటిపై దాడి చేసి, నిప్పంటించిన దుండగులు
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు.

Biplab Dev
Tripura Former CM House Set On Fire : త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. ఉదయ్ పూర్ లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ప్రతి ఏడాది యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి ఉదయ్ పూర్ లోని ఆయన పూర్వీకుల ఇంటికి పూజారులు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేద పండితులపై దాడి చేశారు. వారిపై దాడి చేసి విక్షణారహితంగా కొట్టడమే కాకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టారు. బిప్లబ్ దేవ్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో ఇల్లుతోపాటు మరో దుకాణం దగ్ధమయ్యాయి.
Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.