Home » cotton crop
వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.
పత్తిపైరులో రసంపీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల తాకిడి పెరిగింది. దీంతో మొక్కలు ఎదుగుదల లోపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం �
ప్రత్తి పంట విత్తిన తరువాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తే పలు వాతావరణ ఒడిదుడుకులకు లోనవుతుంది. బెట్ట పరిస్థితుల్లో తామర పురుగులు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయి.
వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.
అయితే గతఏడాది మార్కెట్ లో పత్తికి అధిక ధర పలకడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం 20 నుండి 25 రోజుల దశలో పత్తి ఉంది. అయితే ఇటీవల కురుస్తున్న వరుస భారీ వర్షాలకు చాలా చోట్ల పంట దెబ్బతింది.
ఈ పేస్ట్ వాసనకు ఆకర్షితులై మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు చేరుతుంది. ఆడపురుగు లేకపోవటాన్ని చూడి తికమక పడుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో విఫలం చెందుతుంది.
మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి 25 - 45 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది. ఇటు గాలిలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది.
నూటికి 99 శాతం మంది రైతులు బీటీ రకాలనే సాగుచేస్తున్నారు. కంపెనీలు కూడ విత్తనశుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తర్వాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వాస్తవానికి గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తు