Cotton Crop : ఖరీఫ్ పత్తిలో కలుపు నివారణకు చేపట్టాల్సిన చర్యలు

మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.

Cotton Crop : ఖరీఫ్ పత్తిలో కలుపు నివారణకు చేపట్టాల్సిన చర్యలు

Cotton Crop

Updated On : August 24, 2023 / 9:53 AM IST

Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగుచేసే  ప్రధాన వాణిజ్యపంటలలో పత్తి మొదటిస్థానంలో ఉంది. ప్రస్థుతం విత్తిన పత్తి ఆయాప్రాంతాల్లో 20 నుండి 30 రోజుల దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో కులుపు విపరీతంగా పెరిగింది. దీంతో పంట ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారింది. మొదటి దశలోనే కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుదని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి .

READ ALSO : Chandrayaan-3 : సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం విక్రమ్‌పైకి దూసుకెళ్లిన రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్

వర్షాధారంగా పండే పంటల్లో… అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో..  రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం.. రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో.. ఈ ఏడాది ఏకంగా 50 లక్షల ఎకరాలు దాటి పత్తి సాగవుతుంది.

READ ALSO : Bathini Harinath Goud : చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 20 – 30 రోజుల దశలో పత్తి పంట ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కలుపు అధికంగా పెరిగి, ప్రధాన పంట ఎదుగుదలకు అవరోదంగా మారుతోంది.  అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.

READ ALSO : Chandrayaan 3: జాబిల్లిపై భారత్ ముద్ర.. దేశ ప్రజలందరూ చప్పట్లు కొట్టిన వేళ.. భావోద్వేగభరిత క్షణాలు

సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్ములన సరిగ్గా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలిదశలో పత్తిలో ఆశించే కలుపునివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి.  శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది.