Bathini Harinath Goud : చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

బత్తిని హరినాథ్ గౌడ్ పేరు చెబితే చేప మందు గుర్తుకు వస్తోంది. బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు గత కొన్నేళ్లుగా చేపమందు పంపిణీ చేస్తున్నారు. 

Bathini Harinath Goud : చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Bathini Harinath Goud

Updated On : August 24, 2023 / 10:01 AM IST

Bathini Harinath Goud Passes Away : చేప మందు ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ (84) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పరిస్థితి విష మించడంతో హైదరాబాద్ లో నిన్న రాత్రి బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. బత్తిని హరినాథ్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బోలక్ పూర్ పద్మశాలి కాలనీలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. బత్తిని హరినాథ్ గౌడ్ కు భార్య సుమిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీలోని దూద్ బౌలి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్.

Mrigasira karthi fish : మృగశిర వచ్చింది .. కొరమీను ధర కొండెక్కింది..

1983 సంవత్సరంలో పాత బస్తీ దూద్ బౌలి నుంచి బోలక్ పూర్ పద్మశాలి కాలనీకి నివాసం మార్చారు. బత్తిని హరినాథ్ గౌడ్ పేరు చెబితే చేప మందు గుర్తుకు వస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఆయన చేప మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బత్తిని హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Fish Prasadam : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ

బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు గత కొన్నేళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్నారు.  ఆస్తమా వ్యాధి నివారణకు చేప మందు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం చేప మందు పంపిణీ చేస్తారు. వేలాది మంది ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప మందు కోసం వస్తారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఉబ్బసం, దమ్ము వ్యాధులు నయం అయ్యేందుకు చేప మందు ప్రసాదంను ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున నగరంలో పంపిణీ చేస్తూ వస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేప ప్రసాదం తీసుకునేవారు.