Pink Bollworm : పత్తికి గులాబి రంగు పురుగు గండం.. ముందస్తు నివారణ చర్యలు

వాస్తవానికి గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు.  చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి.  కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తుంది.

Pink Bollworm : పత్తికి గులాబి రంగు పురుగు గండం.. ముందస్తు నివారణ చర్యలు

Pink Bollworm

Updated On : July 31, 2023 / 10:56 AM IST

Pink Bollworm : పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకున్న రైతులకు గులాబిరంగు పురుగులు తలనొప్పిగా మారాయి. నాలుగైదేళ్లుగా పత్తి పంటను గులాబి రంగు పురుగుల ఆశించి నష్టాలను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీప్ లో వేసిన పత్తి 10  నుండి 20 రోజుల దశలో ఉంది. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబి రంగు పురుగు నివారణపట్ల పంట తొలిదశ నుండే అప్రమత్తంగా ఉండాలి.  సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజశేఖర్ .

READ ALSO : Veg-Non Veg At IIT Bombay : ఇక్కడ శాకాహారులే మాత్రమే కూర్చోవాలి .. బాంబే ఐఐటీలో వెజ్-నాన్ వెజ్ వివాదం

తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు.  ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో  సాగవుతోంది. అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. మొదట్లో సూటి రకాలను సాగుచేసేవారు . క్రమేపీ   శనగపచ్చపురుగును తట్టుకునే విధంగా బి.టి-1 పత్తి రకాలను విడుదలచేశారు.

READ ALSO : Sugarcane Cultivation : చెరకు తోటల్లో పెరిగిన తెగుళ్ల ఉదృతి.. సమగ్ర సస్యరక్షణ

పొగాకు లద్దెపురుగు కూడా పత్తికి సమస్యగా మారటంతో రెండింటినీ తట్టుకునే విధంగా బి.టి-2 పత్తి రకాలు విడుదలయ్యాయి. కొన్నాళ్లు బాగానే ఉన్నా, మూడేళ్ల నుండి  ఈ పంటను గులాబి రంగు పురుగు పట్టి పీడిస్తోంది. దేశంలో వాడే 60 శాతం పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

READ ALSO : Pests in Banana : అరటిలో తెగుళ్ల నివారణ

హైబ్రిడ్‌ బీటీ పత్తి రకాలు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్‌ బీటీ పత్తి మాయలో పడ్డారు. 2 వేల సంవత్సరంలో దేశంలో ప్రారంభించిన బీటీ పత్తిసాగు ఇప్పటివరకు మంచి ఫలితాలనే అందించినా, గులాబి రంగు పురుగు దీనికి నిరోధక శక్తిని పెంచుకోవటంతో గత అనుభవాల దృష్ట్యా పత్తి పంటపై నీలినీడలు కమ్ముకున్నాయి.

READ ALSO : Cotton Cultivation : పత్తికి తొలిదశలో ఆశించే చీడపీడల నివారణ

వాస్తవానికి గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు.  చిన్న లార్వాలు మెగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవిత కాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి.  కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తుంది. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్ధాలను తినడం వలన ఆకర్ణ పత్రాలే విప్పుకోకుండా ముడుచుకొనే ఉంటాయి. వీటినే గుడ్డిపూలు అంటారు.

READ ALSO : Cotton Varieties : రైతులకు అందుబాటులో దేశీ పత్తి రకాలు

ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పొడిని తినడం వలన నష్టం కలుగుతుంది. దీంతో తొలిదశలో ఆశిస్తే మొగ్గలు, పూలు  రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం కాని, కాయ పరిమాణం పెరగకపోవడం , కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడటం జరుగుతుంది.

READ ALSO : Cotton Cultivation : పత్తిసాగుకు సన్నద్దమవుతున్న రైతులు.. సాగులో మేలైన యాజమాన్యం

ఈ  పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణ చర్యల్లో భాగంగా గత పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలి. పత్తి విత్తే రైతాంగం సామూహికంగా ఒకేసారి విత్తితే ఈ పురుగు నష్టం తక్కువగా వుంటుంది. పంటలో  గులాబి రంగు పురుగు ఉనికిని  గుర్తించినట్లైతే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించ వచ్చంటున్నారు  పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజశేఖర్ .