Pests in Cotton : పత్తిలో తొలిదశలో వచ్చే చీడపీడల నివారణ
నూటికి 99 శాతం మంది రైతులు బీటీ రకాలనే సాగుచేస్తున్నారు. కంపెనీలు కూడ విత్తనశుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తర్వాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Cotton Cultivation
Pests in Cotton : ఈ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యాయి . తెలంగాణలో ఇప్పటికే కొన్ని చోట్ల పత్తిని విత్తారు రైతులు. మరికొంత మంది విత్తేందుకు సిద్దమవుతున్నారు. అయితే జులై 20 లోపు మాత్రమే పత్తిని విత్తుకోవాలి. తరువాత సాగుచేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పత్తిసాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…
READ ALSO : Kokapet Aunty : ఎకరం వందకోట్లు.. కోకాపేట ఆంటీ అప్పుడే చెప్పింది..
చాలా మంది రైతులు పత్తిని విత్తారు. మరికొన్ని ప్రాంతాల్లో అడపాదడప పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలను అసరాగా చేసుకొని మిగిలిన రైతులు ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పత్తిని సాగుచేయాలనుకునే రైతులు ఎట్టి పరిస్థితుల్లో జులై ( 15 ) లోపు మాత్రమే విత్తుకోవాలి. తరువాత విత్తుకుంటే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
READ ALSO : Paddy Harvesting : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు
అంతే కాదు పంటను తొలిదశలో రసంపీల్చే పురుగులు, పచ్చదొమల బెడద అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సమయానికి అనుకూలంగా నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్తలు.
నూటికి 99 శాతం మంది రైతులు బీటీ రకాలనే సాగుచేస్తున్నారు. కంపెనీలు కూడ విత్తనశుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తర్వాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాదు పత్తి పంటలో తొలిదశలో ఆశించే రసంపీల్చే పుగులు కనిపిస్తాయి. కానీ గులాబి రంగు పురుగు కనిపించదు. పంట నష్టం జరిగే వరకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పురుగుపై ప్రతి రైతు నిఘా వుంచి, ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి.
READ ALSO : China Smartphone : పిల్లలు స్మార్ట్ఫోన్ వాడకంపై కంట్రోల్ కోసం మైనర్ మోడ్ .. చైనా కొత్త ప్రతిపాదనలు
ముందుగా వేసిన చోట పత్తి మూడు, నాలుగు ఆకుల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతలు పెరిగితే తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం నివారణ చర్యలు చేపట్టాలి.