Home » cultivation
చెరకులో నీటివనరును పొదుపుగా , సమర్ధ నిర్వాహనతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చెరకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైనది. ఈ సమయంలో తేమ చాలా అవసరం.
రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఖర్జూరం, శ్రీగంధంతో పాటు మామిడి, మునగ మొక్కలతో మిశ్రమ పంటలసాగుచేస్తున్న రైతు..3 ఏళ్ల క్రితం 7 వేల వాటర్ ఆపిల్ మొక్కలను నాటారు. గత ఏడాది నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడో పంట దిగుబడిని పొందుతున్నారు.
ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు.
కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు తొలిదశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది.
వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు.
ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు.
గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి