RedGram Management : ఖరీఫ్ కంది రకాలు.. సాగు యాజమాన్యం
కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు తొలిదశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది.

Kharif RedGram
RedGram Management : అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో సాగు మరింత లాభసాటిగా మారింది . దీనికి తోడు గత కొంత కాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
READ ALSO : Overnight Millionaire : చెత్తలో దొరికిన 60 ఏళ్లనాటి బ్యాంకు పాస్ బుక్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని .. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఈశ్వరరెడ్డి .
ఖరీఫ్ పంటల సాగులో రైతులు బిజీబిజీగా ఉన్నారు. అక్కడక్కడా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు మెట్టపంటలను విత్తుతున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు .
READ ALSO : CCTV Camera : టమాటా పొలంలో సీసీటీవీ కెమెరాలు…మహారాష్ట్ర రైతు ప్రయోగం
సకాలంలో విత్తడం ఒకఎత్తైతే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే , నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుదని వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఈశ్వరరెడ్డి .
కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు తొలిదశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది. సమయానికి అనుకూలంగా ఎరువుల యాజమాన్యం పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
READ ALSO : High Court : భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే.. ఆ జంటకు విడాకులు మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
ఖరీఫ్ లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగుచేయడం వల్ల పంట చివర్లో బెట్టపరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకొని, సాగుచేసినట్లైతే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.