Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు

గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65  టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి

Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు

Elephant Foot Yam

Updated On : July 30, 2023 / 10:11 AM IST

Kanda Yam Cultivation : వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులోవుంది. కందపంటలో ఎక్కువ శాతం విత్తనానికే పెట్టుబడి అవుతుంది. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోను శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం వుంది. చాలా వరకు రైతులు దుంపలను నాటగా.. ప్రస్తుతం పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్దతులేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Kharif Kandi Cultivation : ఖరీఫ్ కందిలో అధిక దిగుబడులకోసం మెళకువలు

ఈ మధ్య కాలంలో రైతులు కూరగాయల పంటలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి బయట, ఇంటి మీద ఎక్కడైనా సులువుగా కూరగాయల్ని సాగు చేస్తున్నారు. అలాంటి పంటలో కంద సాగు ఒకటి. ఈ కంద పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలో అధికంగా సాగు చేస్తారు రైతులు. ఇటు తెలంగాణాలో ఎక్కువ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు.

READ ALSO : Redgram Varieties : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

ఈ పంట సాగు మే, జూన్ నెలలో మొదలు పెడతారు. అటు గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65  టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి… చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యులు చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధానా శాస్త్రవేత్త డాక్టర్  మమత.

READ ALSO : Intercropping In Kandi : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

కంద పూర్తిగా మొలకెత్తడానికి దాదాపు నేలరోజుల సమయం పడుతుంది. అయితే కందలో అంతర కృషి చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారి చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు  చేసిన మేరకు ఎరువలను సమయానుకూలంగా అందించాలి.