Home » Rasi Phalalu
ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు వస్తాయి. మొండితనం వల్ల వ్యవహారాలు బెడిసికొడతాయి . ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పెద్దల మాట పాటించడం అవసరం. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
కుటుంబంలో కలతలు రేగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. స్టాక్ మార్కెట్లో ఆచితూచి వ్యవహరించండి.
శత్రువులు మిత్రులు అవుతారు. తండ్రి తరఫు వారి నుంచి శుభవార్త వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
భూమి కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
అదృష్టం తలుపు తడుతుంది. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. భోజన సౌఖ్యం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
అనుకోని అదృష్టం తలుపు తడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ లావాదేవీల్లో లాభం అందుకుంటారు. ఆత్మీయులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. శివాలయాన్ని సందర్శించండి.
కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు.
రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన చర్చల్లో తలదూర్చకండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. స్త్రీ మూలకంగా చికాకులు ఏర్పడతాయి.