Horoscope Today: ఆదుకునే గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభం..!
శత్రువులు మిత్రులు అవుతారు. తండ్రి తరఫు వారి నుంచి శుభవార్త వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

Horoscope Today
Horoscope Today: గ్రహ గతులు కాస్త ఆగమాగం ఉన్నా.. గురు, చంద్రుల పరస్పర కేంద్ర స్థితి గజకేసరి యోగాన్ని ఏర్పరిచింది. నిన్న మొదలైన అరుదైన యోగం ఈ రోజంతా కొనసాగుతుంది. ఫలితంగా చంద్రుడు అధిపతిగా ఉన్న కర్కాటక రాశి వారికి, గురువు అధిపతిగా ఉన్న ధనుస్సు, మీన రాశులకు ఊరట లభించనుంది. దీనికితోడు బుధ, శుక్రుల మధ్య దూరం తగ్గుతుండటంతో లక్ష్మీనారాయణ యోగం కూడా ఈ రెండు గ్రహాలు ఆధిపత్యం వహించే రాశులకు ఆకస్మిక లబ్ధి చేకూరనుంది.
మేషం: శారీరకంగా అలసట ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండాల్సిన సమయం. చుట్టూ ఉన్న పరిసరాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. అశ్విని నక్షత్ర జాతకులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. వినాయకుడి ఆరాధన శుభప్రదం.
వృషభం: గ్రహాలన్నీ యోగించే స్థితిలో ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించకండి. దైవబలం మెండుగా ఉంది. ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.
మిథునం: కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు తప్పకపోవచ్చు. మీరు వెచ్చించే ప్రతి రూపాయీ సద్వినియోగం అవుతుంది. పిల్లల విషయంలో అనవసరంగా ఆందోళనకు గురవుతారు. స్థిమితంగా ఉండండి. వేంకటేశ్వర స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరుగుతాయి. అంతగా పట్టించుకోకుంటే మేలు. ఆర్థికంగా ఒక అండ దొరుకుతుంది. రుణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త వింటారు. కాలభైరవ అష్టకం పఠించండి.
సింహం: లేనిపోని ఊహాగానాలకు తెరపడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిషాకరం అవుతాయి. రాబడి మార్గాలు తెరుచుకుంటాయి. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు వినండి.
కన్య: శత్రువులు మిత్రులు అవుతారు. తండ్రి తరఫు వారి నుంచి శుభవార్త వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సోదరుల వల్ల చికాకులు తలెత్తవచ్చు. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి.
తుల: కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. లలితా సహస్ర నామాలు వినండి.
వృశ్చికం: కొన్ని రోజులుగా ఉన్న ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగా మంచి అవకాశం చేజిక్కించుకుంటారు. చర్చల ద్వారా లబ్ధి పొందుతారు. పెద్దల నుంచి విలువైన సమాచారం అందుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
ధనుస్సు: అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. సమయపాలన చాలా అవసరం. మిత్రులను శత్రువులుగా మార్చుకోకండి. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది.
మకరం: పరిస్థితుల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
కుంభం: కుటుంబంలో కలతలు రేగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. మానసికంగా సంఘర్షణకు గురవుతారు. సాయంత్రానికి కొంత మార్పు వస్తుంది. సమయపాలన పాటించడం అవసరం. శివారాధన మేలు చేస్తుంది.
మీనం: రోజంతా చాలా హడావుడిగా గడిచిపోతుంది. లాభనష్టాలు ఉండవు. మానసికంగా కొంత ఉపశమనం మాత్రం పొందుతారు. స్నేహితులను కలుసుకుంటారు. మంచి విందు భోజనం చేస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.