Artificial Intelligence: మానవ జాతిని ఏఐ టెక్నాలజీ అంతం చేస్తుందా? శాస్త్రవేత్తలేం చెబుతున్నారు!

మానవ జాతికి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే, పోటీ తత్వం పెరిగి మానవ జాతికే ఎసరుపెడతాయని వారంటున్నారు.

Artificial Intelligence: మానవ జాతిని ఏఐ టెక్నాలజీ అంతం చేస్తుందా? శాస్త్రవేత్తలేం చెబుతున్నారు!

Artificial Intelligence: శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ భవిష్యత్తులో మానవ జాతి మనుగడకే ముప్పు తేనుందా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు పరిశోధకులు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ మానవ జాతిని అంతం చేయగలదని వారు హెచ్చరిస్తున్నారు.

CM KCR: వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్

గూగుల్, ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన వివరాల్ని ఏఐ మ్యాగజైన్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. దీని ప్రకారం.. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది, అందుబాటులోకి వస్తే అది మానవజాతి మనుగడకే ముప్పుగా మారుతుంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో వాడుతున్న కోడింగ్, అనుసరిస్తున్న గైడ్‌లైన్స్ ప్రకారం రోబోలు మనుషులకు ఎలాంటి హాని చెయ్యలేవు. మనుషులు వాటికి హాని చేసినా సరే, తిరిగి రోబోలు మనుషులకు హాని చేయని విధంగానే ప్రస్తుతం వాటిని రూపొందిస్తున్నారు. అయితే, ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఈ రూల్స్ మారిపోవచ్చు.

Pregnant Woman: గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్ లోన్ కట్టలేదని ఘాతుకం

వాటిని సృష్టించిన మనుషులు రూపొందించిన రూల్స్‌నే అవి అతిక్రమించవచ్చు. టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ను ఉపయోగించుకుని ఇవి వనరుల కోసం మనుషులతోనే పోటీ పడొచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో ‘చీటింగ్ స్ట్రాటజీ’ పెరిగిపోతుంది. ఇది మానవ జాతికి హాని చేయొచ్చు. పరిమిత వనరులు ఉన్నప్పుడు మానవులు వాటితో పోటీ పడాల్సి వస్తుంది. ఈ దశలో మానవ జాతి గెలుపును ఎక్కువగా ఆశించకూడదు. అలాగే అవి మనుషులు చెప్పే పనులు చేయడం మానేసి, సొంత టాస్కుల్ని పూర్తి చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇలాంటి పరిణామాలతో మానవ జాతికి ముప్పు తప్పదని సైంటిస్టులు అంటున్నారు.