CM KCR: వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్

తెలంగాణలో వారం రోజుల్లో 10 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఆదివాసి, బంజారా ఆత్మీయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

CM KCR: వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్

CM KCR: వారం రోజుల్లోగా తెలంగాణలో పది శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేశారు.

Cheetahs In India: చీతాలు పెంపుడు జంతువులే! ఇండ్లల్లోనే పెంచుకున్న భారతీయులు… అప్పటి వీడియోలు విడుదల

‘‘వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల జీవో అమలు చేస్తాం. మోదీ.. ఆ జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా? కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. కాబట్టి రాష్ట్రమే దాన్ని అమలు చేస్తుంది. పోడు భూముల రైతులకు పట్టాలిస్తాం. త్వరలో గిరిజన బంధు కూడా ఇస్తాం. సంపద పెంచడం.. అవసరమైన వారికి పంచడమే లక్ష్యం. ఎస్టీ రిజర్వేషన్లు పది శాతానికి పెంచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపి ఏడేళ్లైంది. కేంద్రం ఆ బిల్లును ఎందుకు తొక్కిపెడుతోంది? రాష్ట్రపతి ఆమోదం ఇచ్చి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో ఇస్తాం. ఈ రోజు మోదీ బర్త్ డే. చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపండి.

Kerala Sit-In-Lap Controversy: కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం.. కొత్త బెంచీ నిర్మాణానికి అంగీకారం

విభజన రాజకీయం మొదలుపెట్టిన కేంద్ర హోం మంత్రిని అడుగుతున్నా… ఇక్కడికి వచ్చి విద్వేషాలు పెంచడం, రాజకీయం తప్ప మీరేం చేశారు? పేదల ఉసురు పోసుకునే పనులు కేంద్రం చేస్తోంది. రూ.లక్షల కోట్లు కార్పొరేట్లకు కేంద్రం దోచి పెడుతోంది. కష్టపడి సంపాదించుకున్న తెలంగాణలో కల్లోలం రాకుండా చూసుకోవాలి. మత పిచ్చి అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీరు జాతీయ రాజకీయాల్లోకి రండి. మహారాష్ట్రలో మేం మీ వెంట ఉంటాం అని కొందరు చెబుతున్నారు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.