Cheetahs In India: చీతాలు పెంపుడు జంతువులే! ఇండ్లల్లోనే పెంచుకున్న భారతీయులు… అప్పటి వీడియోలు విడుదల

మన దేశంలో ఒకప్పుడు చీతాల్ని పెంపుడు జంతువుల్లాగా ఇండ్లల్లోనే పెంచుకునే వాళ్లు. వాటిని మచ్చిక చేసుకుంటే అవి మనుషులతో ఎంతో దగ్గరగా ఉండేవి. కావాలంటే కొన్ని వీడియోలు, చిత్రాలు కూడా ఉన్నాయి చూడండి.

Cheetahs In India: చీతాలు పెంపుడు జంతువులే! ఇండ్లల్లోనే పెంచుకున్న భారతీయులు… అప్పటి వీడియోలు విడుదల

Cheetahs In India: దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి దేశంలోకి అడుగుపెట్టాయి. ఏడు దశాబ్దాల క్రితం వరకు ఇవి మన దేశంలో భారీగానే ఉండేవి. వీటికి మన వాళ్లు ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారు అంటే.. వాటిని కుక్కలు, పిల్లులు, పశువుల్లాగా కొందరు ఇండ్లలోనే పెంచుకునే వాళ్లు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వీటిని అటవీ జంతువుల్లాగా కాకుండా.. పెంపుడు జంతువుల్లా చూసే వాళ్లు.

BiggBoss 6 Day 12 : రెండో వారం కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా.. హౌస్ లో సందడి చేసిన కృతిశెట్టి, సుధీర్ బాబు..

దీనికి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనుషులతో ఎంతో దగ్గరగా ఉండేవి. వీటిని మచ్చిక చేసుకుంటే మనుషులకు త్వరగా దగ్గరయ్యేవి. పులుల్ని, సింహాల్ని, కుక్కల్ని పెంచుకున్నప్పటికీ కొన్నిసార్లు అవి యజమానులపై దాడి చేస్తాయి. కానీ, చీతాలు మాత్రం ఎక్కువగా దాడులకు పాల్పడలేదు. వీటిని మనవాళ్లు ఇంటి దగ్గర కాపలాగా, వేట కుక్కల్లాగా పెంచుకునేవాళ్లు. వ్యవసాయానికి వెళ్లేటప్పుడు, అడవుల్లో జంతువుల్ని వేటాడటానికి, పొలాల దగ్గర రక్షణగా తీసుకెళ్లేవాళ్లు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఇంటికో చీతా ఉండేదట. వీటిని యజమానులు గొలుసులకు కట్టేసి ఉంచేవాళ్లు. పులులు, ఇతర మృగాలతో పోలిస్తే ఇవి చాలా సౌమ్యమైనవి అంటుంటారు. మనుషులకు ఇంత దగ్గరగా ఉన్న ఇవి కాలక్రమేణా అంతరించిపోయాయి.

Cheetahs In India

Cheetahs Back In India: చీతాలు కార్లకంటే వేగం.. మూడు సెకండ్లలో వంద మీటర్ల పరుగు.. కానీ

బ్రిటీషోళ్ల రాకతోనే
భారతీయులు కొన్ని దశాబ్దాల క్రితం వీటితో పరుగు పందాలు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో వీటిని సాధారణంగా పెంచేవాళ్లు. అయితే, బ్రిటీషర్లు మన దేశంలోకి వచ్చాక వీటిని వేటాడటం మొదలుపెట్టారు. వాళ్లకు వేట ఒక సరదా కాబట్టి, చిరుతల్ని వేటాడి చంపేవాళ్లు. అలాగే బ్రిటీషర్లు దేశంలో తేయాకు, కాఫీ వంటి తోటల్ని పెంచాలనుకున్నప్పుడు కూడా వీటి వల్ల ప్రమాదం అని భావించి చీతాల్ని చంపేవాళ్లు.

Mumbai Attack: ముంబై దాడుల సూత్రధారిపై నిషేధానికి అడ్డుతగిలిన చైనా.. మరోసారి భారత ప్రయత్నాల్ని అడ్డుకున్న చైనా

ఈ నిర్ణయంతో అటు చీతాలు చనిపోవడమే కాకుండా, తేయాకు తోటల ఏర్పాటు కోసం అడవుల్ని నరికివేయడంతో వాటికి ఆవాసం, ఆహారం కరువైంది. 1871 నుంచి చీతాల్ని చంపిన వారికి బ్రిటీషర్లు నగదు బహుమతులు కూడా అందజేసేవాళ్లు. అప్పట్లో చీతా పిల్లల్ని చంపితే రూ.6, పెద్ద వాటిని చంపితే రూ.12 బహుమతులుగా ఇచ్చే వాళ్లు. దీంతో డబ్బు కోసం వీటిని చాలా మంది చంపేవాళ్లు. క్రమంగా వీటి సంఖ్య తగ్గిపోయింది. ఈ దశలో చాలా చీతాలకు తోడు దొరక్కపోవడంతో సంతానోత్పత్తి జరగలేదు. దీంతో వీటి జనాభా తగ్గి, అంతరించిపోయాయి.