Kerala Sit-In-Lap Controversy: కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం.. కొత్త బెంచీ నిర్మాణానికి అంగీకారం

రెండు నెలల క్రితం కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట కలిసి కూర్చోవడం ఇష్టంలేని స్థానికులు, వాళ్లు కూర్చునే బెంచీని మూడు భాగాలుగా విడగొట్టారు. దీనికి నిరసనగా మూడు బెంచీలపై అబ్బాయిల ఒళ్లో అమ్మాయిలు కూర్చున్నారు.

Kerala Sit-In-Lap Controversy: కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం.. కొత్త బెంచీ నిర్మాణానికి అంగీకారం

Kerala Sit-In-Lap Controversy: రెండు నెలల క్రితం కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని ఒక కాలేజీ సమీపంలో చిన్న బస్ స్టాండ్ ఉంది. అయితే, అక్కడ ఏర్పాటు చేసిన బెంచీపై కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cheetahs In India: చీతాలు పెంపుడు జంతువులే! ఇండ్లల్లోనే పెంచుకున్న భారతీయులు… అప్పటి వీడియోలు విడుదల

దీంతో విద్యార్థులు బెంచీపై కలిసి కూర్చోవడం ఇష్టం లేని స్థానికులు బెంచీని మూడు భాగాలుగా విడదీశారు. దూరందూరంగా ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థుల్లో నిరసన వ్యక్తమైంది. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య బేధం చూపించడానికి వాళ్లెవరని విద్యార్థులు ప్రశ్నించారు. తమని ప్రశ్నించే ‘మోరల్ పోలీసింగ్’ను తప్పుబట్టారు. దీనికి నిరసనగా అక్కడ ఏర్పాటు చేసిన మూడు బెంచీలపై అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చున్నారు. మూడు బెంచీల్లో అబ్బాయిల ఒల్లో అమ్మాయిలు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీనికి వాళ్ల ఫ్రెండ్స్ కూడా మద్దతు తెలిపారు. అలా చాలా మంది స్టూడెంట్లు అక్కడికి చేరి, ఒకరి ఒళ్లో ఒకరు కూర్చుని మద్దతు తెలిపారు. అమ్మాయిలు, అబ్బాయిలు వేరు అంటూ లింగ బేధం లేదని విద్యార్థులు చెప్పారు.

Cheetahs Back In India: చీతాలు కార్లకంటే వేగం.. మూడు సెకండ్లలో వంద మీటర్ల పరుగు.. కానీ

ఈ నిరసనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది స్థానికుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. అబ్బాయిలు, అమ్మాయిలు పక్కపక్కన కలిసి కూర్చోవడంలో ఎలాంటి నిషేధం లేదని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత స్థానిక మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. ఈ బస్ స్టాప్‌లో త్వరలో కొత్త బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ కలిసి కూర్చునేలా వీటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పాత బెంచీలను తొలగించారు. తాము లింగ బేధం చూపించబోమని స్థానిక మేయర్ అన్నారు. కొత్త బెంచీ ఏర్పాటుతో ఈ వివాదానికి తెరపడినట్లవుతుంది.