Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 5G అన్‌లిమిటెడ్ డేటాను ఎవరైనా వాడుకోవచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?

Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి ఎయిర్‌టెల్ యూజర్లందరూ 5G అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ యూజర్లు అనే తేడా ఉండదు. ఎవరైనా 5G అన్‌లిమిటెడ్ ఎంజాయ్ చేయొచ్చు.

Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 5G అన్‌లిమిటెడ్ డేటాను ఎవరైనా వాడుకోవచ్చు.. ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?

Airtel Unlimited 5G Data Offer _ Airtel launches unlimited 5G data offer for everyone, here is how to claim

Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి ఎయిర్‌టెల్ యూజర్లందరూ 5G అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ యూజర్లు అనే తేడా ఉండదు. ఎవరైనా 5G అన్‌లిమిటెడ్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం (Airtel) ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం కొత్త అన్‌లిమిటెడ్ 5G డేటాను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న అన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లపై అందించే డేటా వినియోగంపై లిమిట్ తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు 5G డేటా వినియోగంపై ఎలాంటి లిమిట్ లేదు.

ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా? మీరు చేయాల్సిందిల్లా.. రూ. 239తో రీఛార్జ్ లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు ఉన్న ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ (Airtel) అందించే అన్ని పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. (Airtel 5G) వినియోగదారులు ఇప్పుడు డేటా లిమిట్స్ లేదా రోజువారీ డేటా కోటా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం వెల్‌కమ్ ఆఫర్ కింద 5G అన్‌లిమిటెడ్ డేటా (Unlimited 5G Data Offer) ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. 5G-రెడీ డివైజ్‌లను కలిగిన (Airtel 5G Plus) నెట్‌వర్క్‌లో అర్హత గల ప్లాన్‌లలోని ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇప్పుడు Unlimited 5G డేటాను ఆస్వాదించవచ్చునని కంపెనీ తెలిపింది.

Airtel Unlimited 5G Data Offer _ Airtel launches unlimited 5G data offer for everyone, here is how to claim

Airtel Unlimited 5G Data Offer _ Airtel launches unlimited 5G data offer for everyone

Read Also : Airtel-Vi OTT Plans : ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఓటీటీ ప్లాన్లు.. రీఛార్జ్ చేసుకోవడమే ఆలస్యం.. ఎన్ని డేటా బెనిఫిట్స్ అంటే? ఫుల్ లిస్టు మీకోసం..!

ప్రస్తుతానికి దాదాపు 270 భారతీయ నగరాల్లో మాత్రమే (Airtel 5G Plus) అందుబాటులో ఉంది. మరో పోటీదారు టెలికం దిగ్గజమైన రిలయన్స్ జియో (Reliance Jio) భారత్‌లో 365 నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను విస్తరించింది. జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ చాలా వెనుకబడి ఉంది. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5Gని అందుబాటులోకి తెస్తామని జియో హామీ ఇచ్చింది. మరోవైపు.. ఎయిర్‌టెల్ మార్చి 2024 నాటికి అన్ని నగరాల్లో 5G సర్వీసులను విస్తరిస్తామని ప్రకటించింది. రిలయన్స్ జియో ఇప్పటికే తన ‘Jio 5G Welcome’ ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కొన్ని వారాల క్రితమే టెలికాం దిగ్గజం కూడా రూ.61 ధరతో ‘5G Upgrade’ డేటా ప్లాన్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ‘అన్‌లిమిటెడ్ 5G డేటా’ ఆఫర్‌ను పొందాలంటే మీ 5G రెడీ ఫోన్లలో కంపెనీ ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్‌ని ఓపెన్ చేయాలి. ఎయిర్‌టెల్ బ్యానర్ మెయిన్ పేజీలో ఇతర ప్రాంతాలలో కనిపిస్తుంది. 5G నెట్‌వర్క్ ప్రాంతాలలో మాత్రమే అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం.. ఎయిర్‌టెల్ ప్యాక్ వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు రాబోయే బిల్ జనరేషన్‌లో పేమెంట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఎయిర్‌టెల్ 5G కస్టమర్లు అయితే.. ఇప్పుడే ఎయిర్‌టెల్ అందించే 5G అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ పొందండి..

Read Also : Jio – Airtel 5G Data Plans : జియో – ఎయిర్‌టెల్ 5G ప్లాన్లు ఇవే.. ఈ ప్లాన్లపై 3GB డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!