Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్ లో వేలు పెట్టమన్న “అలెక్సా”

తనను సవాలు చేసేందుకు ఏదైనా టాస్క్ ఇవ్వమంటూ "అలెక్సా"ను అడిగిన ఓ పదేళ్ల చిన్నారికి.. ప్రాణాపాయమైన సూచన చేసింది అలెక్సా.

Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్ లో వేలు పెట్టమన్న “అలెక్సా”

Alexa

Dangerous Alexa:  మీరు మీ ఇంటిలో అలెక్సా పరికరాన్ని వాడుతున్నారా? అయితే అది చెప్పే సమాధానాల పట్ల జాగ్రత్త వహించండి. రానురాను కృత్రిమ మేద ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలిపే ఘటన ఇది. తనను సవాలు చేసేందుకు ఏదైనా టాస్క్ ఇవ్వమంటూ “అలెక్సా”ను అడిగిన ఓ పదేళ్ల చిన్నారికి.. ప్రాణాపాయమైన సూచన చేసింది అలెక్సా. “అలెక్సా” అనేది అమెజాన్ సంస్థ అభివృద్ధి చేసిన కృత్రిమ మేద పరికరం. మనుషులు మౌఖికంగా(వాయిస్ కమాండ్స్) అడిగే ఏదైనా సమాచారానికి స్పందిస్తూ.. తన డేటా బేస్ లో పొందుపరిచిన సమాచారాన్ని అలెక్సా చదివి వినిపిస్తుంది. అమెజాన్ సంస్థ తయారు చేసిన ఈ అలెక్సా పరికరాలకు డిమాండ్ ఉంది. చిన్నారులకు ఇంటి వద్ద పద్యాలూ, పాఠాలు చెప్పేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కొందరు తల్లితండ్రులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.

Also read: CM Jagan in Delhi: రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రికి విజ్ఞప్తి

అమెరికాకు చెందిన క్రిస్టిన్ లివ్డాల్ అనే మహిళ ఇటీవల తన పదేళ్ల కూతురు కోసం ఈ అలెక్సా పరికరాన్ని కొనిచ్చింది. ఆన్ లైన్ ద్వారా చిన్న చిన్న సమస్యలను ఛేదించడం నేర్చుకుంటున్న ఆ చిన్నారి, తనకు ఏదైనా ఛాలెంజ్ ఇవ్వమంటూ అలెక్సాను కోరింది. చిన్నారి వాయిస్ కమాండ్స్ కు స్పందించిన అలెక్సా “ఒక కరెంటు ప్లగ్ లో ఫోన్ చార్జర్ ను కాస్త బయటకు పెట్టి, రెండు ప్లగ్ ల మధ్యలో ఒక నాణేనాన్ని చేత్తో పట్టుకోవాలని” సూచించింది. దీంతో అక్కడే ఉన్న చిన్నారి తల్లి అలెక్సా ఇచ్చిన సమాధానం విని ఒక్కసారిగా కంగు తినింది. చిన్నారి తల్లి అక్కడే ఉండడంతో ఆ పాప తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విషయాన్ని అమెజాన్ సంస్థ దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో అమెజాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. అలెక్సా ఇచ్చిన సమాచారం “OurCommunityNow.com” అనే వెబ్ సైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆ వెబ్ సైట్ ను అలెక్సా డేటాబేస్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.

Also read: Business News: అమెజాన్ – ఫ్యూచర్ సంస్థల పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఇక తన అనుభవాన్ని క్రిస్టిన్ లివ్డాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది విన్న నెటిజన్లు అలెక్సా పరికరాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ సంస్థ ఇటువంటి పరికరాలు అమ్మకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ అలెక్సా ఇటువంటి తప్పిదాలు చేసినట్టు నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఇటువంటి పరికరాలు మనుషులకు సహాయం చేస్తే చాలుగాని కీడు తలపెట్టకూడదంటూ టెక్ పండితులు చెబుతున్నారు.

Also Read: Agra : గ్రామంలో రోడ్డు కోసం బురద నీటిలోనే నిరసన చేస్తూ..మహిళ మృతి