Amazon Prime Day Sale 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ ఫోన్లపై టాప్ డీల్స్.. మరెన్నో డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
Amazon Prime Day Sale 2023 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో, రియల్‌మి నార్జో 60, మోటోరోలా రెజర్ 40 అల్ట్రాతో సహా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు తగ్గింపుతో (బ్యాంక్ ఆఫర్లతో సహా) అందుబాటులో ఉంటాయి.

Amazon Prime Day Sale 2023 _ Top deals on OnePlus Nord 3, iQOO Neo 7 Pro you should not miss
Amazon Prime Day Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale 2023) జూలై 15 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ జూలై 16 వరకు రెండు రోజుల సేల్ కొనసాగునుంది. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లను మినహాయించి స్మార్ట్‌ఫోన్ కేటగిరీకి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ అమెజాన్ సేల్ సమయంలో OnePlus Nord 3, iQOO Neo 7 Pro, Realme Narzo 60, Motorola Razr 40 Ultraతో సహా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు తగ్గింపుతో (బ్యాంక్ ఆఫర్లతో సహా) అందుబాటులో ఉంటాయి.
మీ బడ్జెట్ రూ. 10వేల లోపు ఉంటే.. 90Hz డిస్ప్లే, 33W ఛార్జింగ్, ఆక్టా-కోర్ ప్రాసెసర్, మరిన్నింటితో సహా అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ డే సేల్స్ ప్రారంభమయ్యే ముందు కస్టమర్లు మెరుగైన ఆప్షన్ ఎంచుకోవడంలో సాయపడేందుకు అమెజాన్ స్మార్ట్ఫోన్ల తగ్గింపు ధరలను కూడా వెల్లడించింది. మీ పాత డివైజ్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు చెక్ చేయగల కొన్ని ఆప్షన్లు ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 3 :
కొత్త వన్‌ప్లస్ నార్డ్ 3 ప్రారంభ ధర రూ. 33,999. అయితే, ICICI బ్యాంక్ లేదా SBI బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగదారులు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. రూ. 32,999 ఫోన్‌ను సమర్థవంతంగా కొనుగోలు చేయవచ్చు. Nord 3 ఫ్లాగ్షిప్-స్థాయి Dimenstiy 9000 SoC, 50MP Sony IMX 890 OIS రెడీ కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 80W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఐక్యూ నియో 7 ప్రో :
కొత్త స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC-ఆధారిత (iQOO Neo 7 Pro) MRP ధర రూ. 33,999 నుంచి రూ. 31,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 50MP OIS కెమెరాను కూడా కలిగి ఉంది. 120W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. iQOO 5,000mAh బ్యాటరీతో కూడిన ఫోన్ బండిల్ చేసిన ఛార్జర్‌తో 30 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ పొందుతుందని పేర్కొంది.
మోటోరోలా Razr 40 అల్ట్రా :
మోటరోలా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న (Razr 40 Ultra) కూడా ప్రైమ్ సేల్ సమయంలో విక్రయించనుంది. కస్టమర్లు ఆఫర్లతో రూ. 89,999 నుంచి రూ. 82,999కి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. Razr 40 అల్ట్రా స్లిమ్మెస్ట్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్లలో ఒకటిగా ఉంది. అతిపెద్ద కవర్ డిస్ప్లే (3.6 అంగుళాలు)తో వస్తుంది. ఒరిజనల్ ఐఫోన్ 3.5-అంగుళాల వ్యూ ఏరియాను అందించింది. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు కూడా ఫోన్ దాదాపు పూర్తిగా పనిచేస్తుందని అర్థం. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా కూడా పవర్ అందిస్తుంది.

Amazon Prime Day Sale 2023 _ Top deals on OnePlus Nord 3, iQOO Neo 7 Pro you should not miss
రియల్‌మి నార్జో 60 ఫోన్ :
మీరు స్టోరేజీకి ప్రాధాన్యత ఇస్తే.. నార్జో 60 సెగ్మెంట్లో 1TB స్టోరేజీ, 12GB RAMని అందించే మొదటి ఫోన్. ప్రైమ్ డే సేల్‌లో ఈ ఫోన్ రూ.23,999కి బదులుగా రూ.22,499కి (ఆఫర్లతో) రిటైల్ అవుతుంది. 100MP OIS రెడీ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంది.
రూ. 10వేల లోపు ఫోన్లు :
రూ. 10వేల లోపు అనేక ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన డివైజ్‌లు ఉన్నాయి.
– Realme Narzo N53 128GB : రూ 8,999
– Samsung Galaxy M13 64GB : రూ 9,699
– Nokia C12 : రూ 5,129
ఆన్లైన్ సేల్ ఈవెంట్లో ధరలు డిమాండ్ సరఫరా ఆధారంగా మారుతూ ఉండవచ్చని గమనించాలి. అదేవిధంగా, ఎంపిక చేసిన ఫోన్ల స్టాక్‌లు, ముఖ్యంగా iPhoneలు పరిమితం కావచ్చు.