Apple iPhone 12 : భారత్‌లోనే అత్యంత పాపులర్ 5G ఫోన్‌గా ఆపిల్ ఐఫోన్ 12.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 12 : దేశంలో ఎట్టకేలకు 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. కొనుగోలుదారులు 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు ప్రతి మొబైల్ కంపెనీ వివిధ ధరల్లో 5G ఫోన్‌లను మార్కెట్లో రిలీజ్ చేశాయి.

Apple iPhone 12 : భారత్‌లోనే అత్యంత పాపులర్ 5G ఫోన్‌గా ఆపిల్ ఐఫోన్ 12.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 12 is the most popular 5G phone in India, claims report

Apple iPhone 12 : దేశంలో ఎట్టకేలకు 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. కొనుగోలుదారులు 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు ప్రతి మొబైల్ కంపెనీ వివిధ ధరల్లో 5G ఫోన్‌లను మార్కెట్లో రిలీజ్ చేశాయి. దాంతో వినియోగదారులకు ఏ 5G ఫోన్ బెస్ట్ అనేది ఎంచుకోవడం కష్టంగా మారింది.

మీరూ ఏ ఐఫోన్‌ను కొనుగోలు చేయాలో నిర్ణయించలేకపోతున్నారా? అయితే స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ డేటా (ఓక్లా ద్వారా) ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 12 భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 5G డివైజ్.. Apple India వెబ్‌సైట్ ప్రకారం.. Apple iPhone 12 ప్రారంభ ధర రూ. 59,900గా ఉంది. ప్రస్తుతం Amazon లో 64GB మోడల్ కోసం రూ. 47,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Apple iPhone 12 is the most popular 5G phone in India, claims report

Apple iPhone 12 is the most popular 5G phone in India, claims report

గ్లోబల్ నెట్‌వర్క్, కనెక్టివిటీ ఇంటెలిజెన్స్ సంస్థ – ఊక్లా నిర్వహించిన సర్వేలో 51శాతం మంది ఇప్పటికే 5G ఫోన్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. సర్వే ప్రకారం.. టాప్ వెండర్లు Samsung (31శాతం), Xiaomi (23శాతం), Realme, Vivo ముందంజలో ఉన్నాయి. 51శాతం సర్వేలో ఇప్పటికే 5Gకి సపోర్టు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు.

మార్కెట్‌లోని టాప్ స్మార్ట్‌ఫోన్ డీలర్స్ Samsung (31శాతం), తర్వాతి స్థానాల్లో Xiaomi (23శాతం), Realme, Vivo ఉన్నాయి. సర్వేలో ప్రతి పది మందిలో ఒకరికి మాత్రమే ఐఫోన్ ఉండగా.. Apple స్మార్ట్‌ఫోన్‌లు 5G సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తేలింది. వాస్తవానికి.. స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఐఫోన్ 12 5G భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 5G డివైజ్ అని ఓక్లా నివేదిక పేర్కొంది.

Apple iPhone 12 is the most popular 5G phone in India, claims report

Apple iPhone 12 is the most popular 5G phone in India, claims report

5G టెస్ట్ నెట్‌వర్క్‌లలో దేశంలో 5G డౌన్‌లోడ్ స్పీడ్ 500 Mbpsకి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. తక్కువ రెండంకెల (16.27 Mbps) నుంచి మైండ్‌బ్లోయింగ్ 809.94 Mbps వరకు స్పీడ్ తాకింది. టెలికం ఆపరేటర్‌లు ఇప్పటికీ తమ నెట్‌వర్క్‌లను రీకాలిబ్రేట్ చేస్తున్నారు. 4G మార్కెట్‌లోకి వచ్చిన సమయంలో Go-to-Market వ్యూహాన్ని 2023లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Google భాగస్వామ్యంతో Jio Android ఆధారిత 5G ఫోన్‌ను లాంచ్ చేస్తుందని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఊక్లా నిర్వహించిన సర్వేలో 89శాతం మంది భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5Gకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు రెడీగా ఉన్నారని తేలింది. స్పీడ్‌టెస్ట్ వినియోగదారులలో Jio 5G డివైజ్‌లలో (67.4శాతం), ఎయిర్‌టెల్ (61.6శాతం), Vi India (56శాతం) తర్వాత అతిపెద్ద పెరుగుదల కనిపించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!