iPhone 12 Low Price : అమెజాన్‌లో iPhone 12పై మళ్లీ భారీ డిస్కౌంట్.. ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

iPhone 12 Low Price : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale) మరో ప్రీడమ్ సేల్‌తో వచ్చింది. ఆగస్టు 15 కన్నా ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ (Amazon Great Freedom sale)ను నిర్వహిస్తోంది.

iPhone 12 Low Price : అమెజాన్‌లో iPhone 12పై మళ్లీ భారీ డిస్కౌంట్.. ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!
ad

iPhone 12 Low Price : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale) మరో ప్రీడమ్ సేల్‌తో వచ్చింది. ఆగస్టు 15 కన్నా ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ (Amazon Great Freedom sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈవెంట్ ఇప్పటికే Amazon Prime మెంబర్లకు లైవ్ అయిపోయింది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేని యూజర్లు ఆగస్టు 6న యాక్సెస్ చేయవచ్చు. ఈ సేల్‌లో, కంపెనీ ఐఫోన్ 12తో సహా అనేక ఐఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

అమెజాన్ సేల్‌లో iPhone 12 భారీ డిస్కౌంట్ :

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ. 58,900తో సేల్ ప్రారంభమైంది. ఐఫోన్ 64GB స్టోరేజ్ మోడల్ డివైజ్‌పై అధికారికంగా 2021 చివరిలో భారీ తగ్గింపుతో వచ్చింది. అప్పుడు ఐఫోన్ 12 ధర రూ. 65,990కి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు రూ.7,090 డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 12 పాత స్మార్ట్‌ఫోన్.. ఇప్పటికీ పర్ఫార్మెన్స్ బాగుంటే.. ఫోటోగ్రఫీ అనుభవాన్నిఅందించగలదు. కానీ, మీరు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే.. మీరు ఐఫోన్ 13ని కొనుగోలు చేయాలి. హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ. 68,900గా ఉండనుంది. ఈ డివైజ్ అసలు రిటైల్ ధర రూ. 79,900గా ఉంది. యూజర్లు రూ.11,000 డిస్కౌంట్ పొందవచ్చు.

iPhone 12 is again available at low price during Amazon Great Freedom sale

iPhone 12 is again available at low price during Amazon Great Freedom sale

మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు రూ. 13,150 వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉందని గుర్తుంచుకోండి. రెండు ఐఫోన్లలోనూ ఇదే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ ప్రస్తుత ఫోన్ కండీషన్ ఆధారంగా ఎక్స్చేంజ్ లభిస్తుంది. మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఐఫోన్ 12, ఐఫోన్ 13 రెండూ అమెజాన్‌లో చాలా తక్కువ ధరలకు సేల్ అందించనుంది. ఈ డివైజ్ కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.. వచ్చే నెల సెప్టెంబర్‌లో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మీరు కొత్త ఐఫోన్‌ను కొనాలంటే మాత్రం మరికొంతకాలం వేచి ఉండవచ్చు. కానీ, చాలా ఖరీదైనది దీని ధర రూ. 80వేల వరకు ఉంటుంది.

Read Also : Apple Employees : ఆపిల్ ఉద్యోగులకు కొత్త ఆప్షన్.. ఇకపై మాస్క్‌లు లేకుండానే ఆఫీసులకు రావొచ్చు!