iPhone 14 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై ఫ్లాట్ డిస్కౌంట్.. మొత్తం రూ.13వేలు తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 14 Price Cut : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అన్ని డిస్కౌంట్లతో కలిపి మొత్తంగా రూ.13వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.

iPhone 14 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై ఫ్లాట్ డిస్కౌంట్.. మొత్తం రూ.13వేలు తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 14 at lowest price, selling on Flipkart (Photo : Google)

iPhone 14 Price Cut : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ల (Apple iPhones)పై భారీ డిస్కౌంట్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 13పై ఆకర్షణీయమైన ప్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 14 గత ఏడాదిలోనే లాంచ్ కాగా.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఇప్పటికే భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. సరికొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ ఇండియా (Apple India) ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా (iPhone 14) లిస్టు అయింది.

అధికారికంగా ఈ ఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో, ఐఫోన్ 14 డిస్కౌంట్ ధర రూ.70,999గా ఉంది. దాదాపు రూ. 9వేల ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. అదనంగా, HDFC బ్యాంక్ కార్డ్ యూజర్లు రూ. 4000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ (iPhone 14) ధర దాదాపు రూ.66వేలకి తగ్గింది.

Read Also : Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్‌‌ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!

అదనంగా, మీ పాత iPhone మోడ్‌ను మార్చాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ రూ. 30వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 14 ఫైనల్ ధర మరింత తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ వాల్యూ మోడల్ నుంచి మోడల్‌కు మారుతూ ఉంటుంది. ఈ ఫోన్ కండిషన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్‌లో డెంట్‌లు లేదా కొన్ని రకాల డ్యామేజ్‌లు ఉంటే.. ఏదైనా ఇంటర్నల్ సమస్యలు ఉంటే మాత్రం.. ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ తక్కువగా ఉంటుంది.

iPhone 14 at lowest price, selling on Flipkart with flat discount of Rs 13,000

iPhone 14 at lowest price, selling on Flipkart (Photo : Google)

ఐఫోన్ 14 కొనుగోలు సరైనదేనా? :
ప్రస్తుతం ఐఫోన్ 14 కొనుగోలుపై ఐఫోన్ 13 ఇప్పుడు పాత ఫోన్ కావడమే కారణంగా చెప్పవచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మాదిరిగానే రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందవచ్చు. ప్రస్తుతం ఆపిల్ (iPhone 13), iPhone 14 ధరల మధ్య పెద్దగా తేడా లేదనే చెప్పాలి. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై రూ.61,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 14పై రూ. 5000 అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 14 ఫోన్ మరెన్నో స్పెసిఫికేషన్లను అందిస్తుంది. A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ప్రస్తుతం ఆపిల్ నుంచి రెండో అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్. ఈ ఫోన్ మూడు ఆప్షన్లలో వస్తుంది. 128GB, 256GB, 512GB స్టోరేజీతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఐఫోన్ 14, ఐఫోన్ 13కి స్పెషిఫికేషన్లతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 14 బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది.

Read Also : OnePlus Nord CE 3 Lite Price : అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!