Apple Mac : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. లేటెస్ట్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

Apple Mac : ఆపిల్ (Apple) తన Mac లైన్ కంప్యూటర్‌లకు సరికొత్త MacOS వెంచురాను లాంచ్ చేసింది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ స్టేజ్ మేనేజర్, అన్ని ఆడియో కంటెంట్ కోసం లైవ్ క్యాప్షన్‌లు, వీడియోలలో లైవ్ టెక్స్ట్, మెసేజ్ ఎడిట్ ఆప్షన్ వంటి ఫీచర్‌లతో వస్తుంది.

Apple Mac : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. లేటెస్ట్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

Apple releases latest version of Mac operating system How to download

Apple Mac : ఆపిల్ (Apple) తన Mac లైన్ కంప్యూటర్‌లకు సరికొత్త MacOS వెంచురాను లాంచ్ చేసింది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ స్టేజ్ మేనేజర్, అన్ని ఆడియో కంటెంట్ కోసం లైవ్ క్యాప్షన్‌లు, వీడియోలలో లైవ్ టెక్స్ట్, మెసేజ్ ఎడిట్ ఆప్షన్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లో అప్‌డేట్ చేసిన ప్రొడక్టులను కూడా యాడ్ చేస్తుంది.

ఏ డివైజ్ అర్హత కలిగి ఉన్నాయి? :
కొత్త మాకోస్ వెంచురా ఇంటర్నల్ PCలకు అందుబాటులో ఉందని ఆపిల్ తెలిపింది.
వీటితొ పాటు -iMac 2017 ఆపై వెర్షన్
– ఐమాక్ ప్రో 2017
– మ్యాక్‌బుక్ ఎయిర్ 2018 ఆపై వెర్షన్
– మ్యాక్‌బుక్ ప్రో 2017 ఆపై వెర్షన్
– Mac Pro 2019 ఆపై వెర్షన్
– మాక్ స్టూడియో 2022
– Mac Mini 2018 ఆపై వెర్షన్
– మ్యాక్‌బుక్ 2017

MacOS Ventura ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
MacOS Ventura  భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న Mac యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఆసక్తి ఉన్నవారు టాప్ లైఫ్ట్ కార్నర్‌లో ఉన్న Apple మెనుకి నావిగేట్ చేసుకోవాలి. ఆపై సిస్టమ్ ప్రాధాన్యతలపై క్లిక్ చేయడం ద్వారా అప్‌డేట్స్ చెక్ చేయవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి.

Apple releases latest version of Mac operating system How to download

Apple releases latest version of Mac operating system How to download

Apple macOS వెంచురా ఫీచర్లు ఇవే :
సరికొత్త macOS Ventura మెయిల్ యాప్‌లో ఈమెయిల్‌లను పంపడాన్ని రద్దు చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. మెయిల్ యాప్‌లో పంపేందుకు కూడా షెడ్యూల్ చేయవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ Remind Me, Follow Up కూడా యాడ్ చేస్తోంది. ఇది మెయిల్‌లను మెరుగ్గా ట్రాక్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. Apple Mac డివైజ్‌లకు వచ్చే మరో ఫీచర్ పాస్‌కీలు (Passkeys). పాస్‌వర్డ్‌లను రీప్లేస్ చేసేందుకు పాస్‌కీలు సేఫ్ సైన్-ఇన్ మెథడ్ అందిస్తుంది. స్పెషల్ లైబ్రరీలో గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యులతో ఫోటోలు, వీడియోలను షేర్ చేసేందుకు OS యూజర్లను అనుమతిస్తుంది.

MacOS featuresతో వస్తున్న ప్రధాన ఫీచర్ స్టేజ్ మేనేజర్. యాప్‌లు, విండోలను ఆటోమాటిక్‌గా నిర్వహించడంలో సాయపడుతుంది. స్టేజ్ మేనేజర్‌తో, యూజర్లు తమ యాక్టివ్ యాప్‌ను మధ్యలో ఉంచవచ్చు. ఇతర ఓపెన్ యాప్‌లను స్క్రీన్ ఎడమ వైపున ఉంచవచ్చు. Macతో వస్తున్న మరో ఫీచర్ కంటిన్యూటీ కెమెరాలను పొందవచ్చు.

యూజర్లు ఐఫోన్‌ను MacOSకి దగ్గరగా తీసుకువచ్చినప్పుడు MacOS వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అధికారికంగా సేల్ స్టాండ్‌లో మాత్రమే ఐఫోన్‌ను ఉంచాలి. అదనపు ఫీచర్లు Mac కోసం కొత్త క్లాక్ యాప్, Mac నుంచి వెదర్ యాప్ సరికొత్తగా రీడిజైన్ సెట్టింగ్‌ల యాప్‌ని కలిగి ఉంటాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!