Bank SMS Scam : బ్యాంకు SMS స్కామ్.. మహిళను ఇలా నమ్మించి రూ. లక్ష కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఈ స్కామ్ ఏంటి? సేఫ్‌గా ఉండేందుకు ఏం చేయాలంటే?

Bank SMS Scam : దేశంలో సైబర్ నేరాల గ్రాఫ్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిరోజూ, ఆన్‌లైన్ మోసాలు, దొంగతనాలపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్కామర్‌లు అమాయకులను మోసగించి డబ్బును దొంగిలించడానికి వారి OTP, బ్యాంక్ వివరాలు లేదా వారి స్మార్ట్‌ఫోన్‌లకు రిమోట్ యాక్సెస్ చేస్తున్నారు.

Bank SMS Scam : బ్యాంకు SMS స్కామ్.. మహిళను ఇలా నమ్మించి రూ. లక్ష కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఈ స్కామ్ ఏంటి? సేఫ్‌గా ఉండేందుకు ఏం చేయాలంటే?

Bank SMS Scam _ Gurugram woman loses Rs 1 lakh in Bank SMS Scam _ what is it, how to stay safe

Bank SMS Scam : దేశంలో సైబర్ నేరాల గ్రాఫ్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిరోజూ, ఆన్‌లైన్ మోసాలు, దొంగతనాలపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్కామర్‌లు అమాయకులను మోసగించి డబ్బును దొంగిలించడానికి వారి OTP, బ్యాంక్ వివరాలు లేదా వారి స్మార్ట్‌ఫోన్‌లకు రిమోట్ యాక్సెస్ చేస్తున్నారు. వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ఇలాంటి అనేక కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఇటీవల నమోదైన కేసులో, గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ బ్యాంక్ నోటిఫికేషన్ SMSను క్లిక్ చేయడంతో లక్షల నగదును కోల్పోయింది. ఓ నివేదిక ప్రకారం.. గురుగ్రామ్‌లోని DLF ఫేజ్ -5 నివాసి మాధవి దత్తా రూ. 1 లక్ష వరకు మోసపోయారని ఆరోపించారు. బాధితురాలికి జనవరి 21న ఆమె ఫోన్‌లో ‘డియర్ యూజర్ మీ HDFC అకౌంట్ ఈరోజు క్లోజ్ అవుతుంది. ఈ లింక్‌ క్లిక్ చేయడం ద్వారా మీ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలని ఉంది. మొబైల్ నంబర్ నుంచి మీ పాన్ కార్డ్ నంబర్ చెప్పడంటూ అని SMS వచ్చింది.

SMSని బ్యాంక్ నోటిఫికేషన్‌గా భావించిన బాధితురాలు దత్తా SMSకి యాడ్ చేసిన లింక్‌పై క్లిక్ చేశారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్‌పేజీకి రీడైరెక్ట్ అయింది. తన పర్సనల్ వివరాలను ఇవ్వాలని మెసేజ్‌లో ఉంది. ఆమె అదే ప్రాసెస్ ఫాలో అయి పాన్ కార్డు నెంబర్, మొబైల్ లింక్ ప్రక్రియను పూర్తి చేసింది. దత్తా ఫోన్‌లో అందుకున్న OTPని నమోదు చేసింది. ఓటీపీని నమోదు చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆమె అకౌంట్ నుంచి రూ.లక్ష తగ్గింది. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయానని ఆమెకు అర్థమైంది. తానుOTPని నమోదు చేసిన వెంటనే తన అకౌంట్ నుంచి రూ.1 లక్ష కాజేశారు. వెంటనే ఆమె సైబర్ హెల్ప్‌లైన్ 1930కి చాలాసార్లు కాల్ చేసినట్టు తెలిపారు. కానీ, కాల్ కనెక్ట్ కాలేదు.

చివరకు సైబర్ పోర్టల్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు దత్తా తన ఫిర్యాదులో తెలిపారు. ఆ తరువాత, సైబర్ క్రైమ్, ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 419, 420 (చీటింగ్) కింద సైబర్ మోసగాళ్లపై FIR నమోదు చేశారు. SMS ఫ్రాండ్, ఫిషింగ్ లింక్‌ల కేసులు కొత్తవి కాదు. సైబర్ సెల్‌ల ద్వారా దీనిపై ఎప్పటికప్పుడూ హెచ్చరికలు చేస్తున్నా ఇలాంటి మోసాలు మాత్రం పెరుగుతున్నాయి. OTP వంటి వ్యక్తిగత ఆధారాలను షేర్ చేయవద్దని లేదా ఏవైనా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని సైబర్ నిపుణులు సైతం సూచిస్తున్నారు. బ్యాంకులు కూడా OTP చెప్పాలంటూ ఎలాంటి లింక్‌ను SMS ద్వారా పంపమంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. అయినా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు.

Read Also : Oppo Reno 8T Launch : 108MP కెమెరాతో ఒప్పో రెనో 8T వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

బ్యాంక్ SMS స్కామ్ అంటే ఏమిటి :
బ్యాంక్ SMS స్కామ్‌లలో, స్కామర్‌లు తరచుగా బ్యాంకులుగా నమ్మిస్తూ ఫేక్ మెసేజ్‌లను పంపుతారు. అకౌంట్ వివరాలు, OTP, ఐడెంటిటీ నెంబర్ల వంటి వ్యక్తిగత డేటాను అడుగుతారు. ఫిషింగ్ లింక్‌లను పంపుతారు. మొబైల్‌తో ఏదైనా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడం లేదా PAN వంటి లింక్ చేసుకోవాలంటూ మెసేజ్‌లు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. OTPని షేర్ చేయమని అడిగితే అసలే చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే.. మీ మొబైల్‌కు రిమోట్ యాక్సెస్ పొందుతారు. మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేస్తారు.

Bank SMS Scam _ Gurugram woman loses Rs 1 lakh in Bank SMS Scam _ what is it, how to stay safe

Bank SMS Scam _ Gurugram woman loses Rs 1 lakh in Bank SMS Scam

మీ అకౌంట్ నుంచి డబ్బును దొంగిలిస్తారు. చట్టబద్ధమైన బ్యాంకులు ఈ సమాచారాన్ని ఎలాంటి మెసేజ్ ద్వారా కస్టమర్లను అభ్యర్థించవని గమనించాలి. ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దు. మీ అకౌంట్ నంబర్, కార్డ్ నంబర్, CVV లేదా వ్యక్తిగత IDల వంటి సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ ఎవరికీ రివీల్ చేయరాదు. బ్యాంక్ SMS వంటి ఆన్‌లైన్ స్కామ్‌లను నివారించడానికి సురక్షితంగా ఉండటానికి మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దాం..

బ్యాంక్ SMS స్కామ్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
* OTP, బ్యాంక్ వివరాలు, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి SMS లేదా కాల్ ద్వారా షేర్ చేయొద్దు.
* మీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. వాటిని క్రమం తప్పకుండా మార్చండి.
* SMS అభ్యర్థనపై చర్య తీసుకునే ముందు పంపినవారిని ధృవీకరించండి.
* బ్యాంక్ హెచ్చరికల సందర్భాలలో, ధృవీకరించడానికి బ్యాంక్ మేనేజర్ లేదా హెల్ప్‌లైన్‌లో సంప్రదించండి.
* SMS లేదా WhatsAppలో లేదా తెలియని చోట నుంచి సోషల్ మీడియాలో అందుకున్న లింక్‌లపై క్లిక్ చేయరాదు.
* ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ప్రారంభించండి.
* మీరు మీ అకౌంట్ యాక్సెస్ చేసేందుకు పాస్‌వర్డ్‌తో పాటు OTPని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
* మీరు ఫింగర్ ఫ్రింట్ వంటి మీ బయోమెట్రిక్‌లను రెండో పాస్‌వర్డ్‌గా కూడా సెట్ చేయవచ్చు.
* కొత్త అకౌంట్ నగదును బదిలీ చేయాలనే అభ్యర్థనలు లేదా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందంటూ ఏదైనా SMS, ఇలాంటి ఫిషింగ్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
* ఏవైనా అనుమానాస్పద SMSలను మీ బ్యాంకుకు వెంటనే నివేదించండి.
* స్కామర్‌లు మిమ్మల్ని మోసగించలేరు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Tech Tips : వాట్సాప్‌లో మీ ఫ్రెండ్ డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా చదవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!