Phone Missing : మీ ఫోన్‌ పోయిందా.. వెంటనే ఇలా చేయండి..లేదంటే..!

Phone Missing : మీ ఫోన్‌ పోయిందా.. వెంటనే ఇలా చేయండి..లేదంటే..!

Phone Missing

Phone Missing : స్మార్ట్ ఫోన్, నిత్యజీవితంలో భాగమైపోయింది. పొద్దున్న లేస్తే చాలామంది తలలు స్మార్ట్ ఫోన్ లోనే ఉంటాయి. ఇక ఇందులో ఉండే రకరకాల యాప్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలియని ప్రదేశాలకు వెళ్లేందుకు స్మార్ట్ ఫోన్ సహాయపడుతుంది. ఇక ఈ మధ్యకాలంలో ఏ వస్తువు కొన్నా యూపీఐ ద్వారానే ఎక్కువగా పేమెంట్ చేస్తున్నారు.

డబ్బు క్యారీ చేయడం చాలావరకు తగ్గించారు. ఏదైనా కొనగానే వెంటనే స్మార్ట్ ఫోన్ తీసి పేమెంట్ చేస్తారు. ఇక ఇదంతా బానే ఉన్నా.. బై మిస్టేక్ మన ఫోన్ పొతే పెద్ద చిక్కుల్లో పడిపోతాం. అయితే కొందరు స్మార్ట్ ఫోన్ పోగానే మరో ఫోన్ కొనుక్కుందాంలే అనే ధీమాలో ఉంటారు. పోయిన స్మార్ట్ ఫోన్ విషయంలో తొందరపడి జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంకు అకౌంట్స్ ఖాళీ కావడం ఖాయమని సైబర్ క్రైం నిపుణులు చెబుతున్నారు.

దొంగలు గతంలోలా లేరని దొంగింలించిన ఫోన్ ను వారి దగ్గర ఉన్న టెక్నాలజీతో ఓపెన్ చేసి అకౌంట్లలోని డబ్బు కాజేస్తున్నారని, అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారని చెబుతున్నారు.

మీ ఫోన్‌ పోతే వెంటనే చేయాల్సినవి..

మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను పూర్తిగా బ్లాక్‌ చేయండి.
మీ సిమ్‌ కార్డుతో రిజిస్టర్‌ ఐనా యూపీఐ సేవలను డియాక్టివేట్‌ చేయండి.
మీ ఫోన్‌లో ఉన్న సిమ్‌ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి.
మీ నంబర్‌పై రిజిస్టర్‌ ఐనా అన్ని మొబైల్‌ వ్యాలెట్లను బ్లాక్‌ చేయండి.
దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్‌ రిజిస్టర్‌ చేయండి.