ChatGPT App for iPhones : ఈ 12 దేశాల్లోని ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్.. ఇందులో భారత్ ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..!

ChatGPT App for iPhones : ఆపిల్ ఐఫోన్‌లలో ChatGPT యాప్ ఇప్పుడు యూకే, ఫ్రాన్స్‌తో సహా మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. డెవలపర్ OpenAI ఇంకా AI చాట్‌బాట్ Android వెర్షన్‌ను రిలీజ్ చేయలేదు.

ChatGPT App for iPhones : ఈ 12 దేశాల్లోని ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్.. ఇందులో భారత్ ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..!

ChatGPT app for iPhones now available in 12 countries

ChatGPT app for iPhones now available in 12 countries : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే దృష్టిపెడుతోంది. ఇప్పటికే, పలు టెక్ కంపెనీలు ఏఐ టూల్స్ వాడేస్తున్నాయి. ఓపెన్ ఏఐ (OpenAI) ద్వారా ఐఫోన్ యూజర్ల కోసంChatGPT యాప్ అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు ఈ చాట్‌జీపీటీ యాప్ అందుబాటులోకి రానుంది. అల్బేనియా, క్రొయేషియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, బ్రెజిల్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, యుకె, నైజీరియా, నికరాగ్వాలో ఈ యాప్ అందుబాటులో ఉందని కంపెనీ (CTO) మీరా మురాటి తెలిపారు. ఈ యాప్ త్వరలో మరిన్ని దేశాలకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

త్వరలో భారత్‌లో ఈ AI యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఆండ్రాయిడ్ (Android) ఫోన్‌లలో (ChatGPT) యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. గత ఏడాది చివరిలో ChatGPT వెబ్ వెర్షన్‌గా వచ్చింది. అప్పటినుంచి చాట్‌బాట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లాట్‌ఫారమ్‌గా మారింది. పబ్లిక్ రిలీజ్ తర్వాత మొదటి రెండు నెలల్లో 100 మిలియన్ల మంది వినియోగదారులను సాధించింది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి యాప్‌లు కూడా ఇంతమంది యూజర్లను సాధించలేకపోయాయి. ఏఐ ప్లాట్‌ఫారమ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించడానికి అందుబాటులో ఉంది. కానీ, వెబ్ వెర్షన్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది.

Read Also : Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ ఒక్కటేనా? రెండింటి మధ్య తేడా ఏంటి? ఏఐ చాటా‌బాట్స్ ఎలా పనిచేస్తాయి? అందరికి ఉచితమేనా?

ప్లస్ మెంబర్‌షిప్ కోసం నెలకు ఎంత చెల్లించాలంటే? :
ప్రముఖ టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేటర్ బాట్ డాల్-E క్రియేటర్ కూడా గత వారమే అమెరికాలో iOS యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ వెర్షన్ ChatGPT వెబ్‌సైట్ మాదిరిగానే పనిచేస్తుంది. సంక్లిష్ట ప్రశ్నలకు సంభాషణ పద్ధతిలో సమాధానాలను అందిస్తుంది. ChatGPT లాంగ్ స్టోరీలను సైతం ఎడిట్ చేయగలదు. ఈ యాప్ కోడ్‌లను రివ్యూ చేయగలదు. మ్యాథమాటిక్ ప్రాబ్లమ్స్ కూడా పరిష్కరించగలదు. ChatGPT ప్లస్ మెంబర్‌షిప్ (నెలకు 20 డాలర్లు లేదా రూ. 1,655) ఉన్న వినియోగదారులు ప్లగిన్‌లకు సపోర్టు అందిస్తుంది. ఇన్‌స్టంట్ రిప్లయ్, వెయిటింగ్ టైమ్ లేకుండా అదనపు ఫీచర్‌లను పొందవచ్చు. ఇప్పటికే ఉన్న ప్లస్ మెంబర్‌లకు కూడా iOS యాప్ ఈ ఫీచర్లను అందిస్తోంది.

ChatGPT app for iPhones now available in 12 countries

ChatGPT app for iPhones now available in 12 countries

చాట్‌జీపీటీ ఈ భాషలను అర్థం చేసుకోగలదు :
స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, డచ్, రష్యన్, చైనీస్, జపనీస్, కొరియన్‌లతో సహా భాషలను చాట్‌బాట్ అర్థం చేసుకోగలదు. ఈ కొత్త దేశాలలో ChatGPT యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు వినియోగదారులు తమ ప్రయాణంలో డేటాను యాక్సెస్ చేసేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాట్‌బాట్ హిందీలో కూడా మాట్లాడగలదు. అయినప్పటికీ ఏఐ టూల్ భాషా ప్రావీణ్యం ఆంగ్లంలో ఉన్నంత ఎక్కువగా ఉండకపోవచ్చు. చాట్‌జీపీటీ యాప్ ఇంకా అందుబాటులో లేని దేశాల్లోని వినియోగదారులు తక్షణమే సమాధానం కావాలంటే ChatGPT లాంటి Bing Chat కాన్వర్‌జేషన్ టూల్ ఉపయోగించవచ్చు.

ఇందుకోసం Microsoft, Bing యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Bing Chat అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులు Microsoft ఇమెయిల్ (లేదా రిజిస్టర్ ఫోన్ నంబర్)తో చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ (Microsoft AI) టూల్ OpenAIతో కంపెనీ వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా ChatGPT లాంగ్వేజ్ మాడ్యూల్‌పై ప్రభావం పడుతుంది. మీరు Microsoft Office యాప్‌లను ఉపయోగిస్తే.. Bing Chat మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, కంపెనీ వర్డ్, ఎక్సెల్, మరిన్నింటికి AI సామర్థ్యాలను నెమ్మదిగా యాడ్ చేస్తోంది. మరోవైపు, గూగుల్ ChatGPT పోటీదారు బార్డ్ ఇంకా యూజర్లకు అందుబాటులో లేదు.

Read Also : ChatGPT App : ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?