Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ ఒక్కటేనా? రెండింటి మధ్య తేడా ఏంటి? ఏఐ చాటా‌బాట్స్ ఎలా పనిచేస్తాయి? అందరికి ఉచితమేనా?

Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ రెండు ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ రెండు ఏఐ చాట్‌బాట్స్ ఉచితంగా వినియోగదారులు యాక్సస్ చేసుకోవచ్చు. రెండింటి మధ్య తేడాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

Bard vs ChatGPT : గూగుల్ బార్డ్ ఏఐ, చాట్‌జీపీటీ ఒక్కటేనా? రెండింటి మధ్య తేడా ఏంటి? ఏఐ చాటా‌బాట్స్ ఎలా పనిచేస్తాయి? అందరికి ఉచితమేనా?

Bard vs ChatGPT _ How are the two free-to-use AI chatbots different_

Bard vs ChatGPT AI chatbots different : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ గురించి చర్చ జరుగుతోంది. టెక్ కంపెనీలు పోటీ పడి మరి సొంత ఏఐ టెక్నాలజీలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో చాట్ జీపీటీ (ChatGPT), బింగ్ ఏఐ (Bing AI) వంటి టూల్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వీటికి పోటీగా గూగుల్ బార్డ్ ఏఐ (Google Bard AI)ని ప్రవేశపెట్టింది.

అయినప్పటికీ ChatGPT స్టేబుల్ అని చెప్పవచ్చు. ఏదైనా ప్రశ్నకు కేవలం సెకన్ల వ్యవధిలో సమాధానమిస్తుంది. మనుషులు స్పందించే మాదిరిగా పనిచేస్తుంది. చారిత్రాత్మక సంఘటనలపై వ్యాసాల నుంచి క్రియేటివిటీ రైటింగ్ వరకు Google లేదా Bing అందించగల సామర్థ్యాన్ని ChatGPT వేగంగా అధిగమించింది.

అంతటితో ఆగలేదు.. గూగుల్ ఇటీవల AI చాట్‌బాట్ బార్డ్‌ను 180 దేశాలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్ దిగ్గజం యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపరచడానికి అనేక ఫీచర్లను కూడా చేర్చింది. OpenAI ChatGPT నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్‌లో అద్భుతమైన సామర్థ్యాలతో దూసుకుపోతోంది.

ChatGPTకి పోటీగా గూగుల్ బార్డ్త్ ఏఐని గత మార్చిలో ప్రవేశపెట్టింది. దాంతో చాలా మంది టెక్ ఔత్సాహికుల్లో బార్డ్ ఏఐ ఆసక్తిని రేకెత్తించింది. కొన్ని రోజులు బార్డ్‌ని ఉపయోగించిన తర్వాత.. ChatGPT కన్నా ఎంతవరకు సమర్థవంతంగా పనిచేయగలదో టెక్ నిపుణులు పరీక్షించారు. రెండు చాట్‌బాట్‌ల మధ్య ప్రధాన తేడాలను లోతుగా విశ్లేషించారు.

Read Also : Google Bard AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐకి పోటీగా.. గూగుల్ బార్డ్ ఏఐ.. భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!

Bard vs ChatGPT మధ్య కీలక తేడాలివే :
రెండు చాట్‌బాట్‌ల మధ్య కీలక తేడాలను పరిశీలిస్తే.. రెండింట్లో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌ను ప్రాథమిక స్థాయిలో ఉపయోగిస్తాయి. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్లకు ఒక ప్రాంప్ట్ లేదా ఎంక్వైరీ మాదిరిగా కనిపిస్తుంది. ఇది మనుషులు ఎలా స్పందిస్తారో అలాగే పనిచేస్తుంది.అయినప్పటికీ, ట్రైనింగ్ పొందిన డేటా మూలాలు, మోడల్స్‌లో చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు.

Creaters : లాంగ్వేజీ మోడల్ : OpenAI : ఓపెన్ ఏఐలో వెర్షన్లు తరచూ మారుతుంటాయి. కానీ, OpenAI జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ 3 (GPT-3) లేదా జెనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ 4 (GPT-4) కస్టమైజడ్ వెర్షన్ మాత్రమే ఉపయోగించారు.

Bard vs ChatGPT _ How are the two free-to-use AI chatbots different_

Bard vs ChatGPT _ How are the two free-to-use AI chatbots different_

Google Bard : గూగుల్ లాంగ్వేజీ మోడల్ (LaMDA) డైలాగ్ అప్లికేషన్స్ కోసం మాత్రమే రూపొందించింది.

Data Sources : Open AI : కామన్ క్రాల్, వికీపీడియా, పుస్తకాలు, కథనాలు, డాక్యుమెంట్లు, ఓపెన్ ఇంటర్నెట్ నుంచి స్క్రాప్ చేసిన కంటెంట్‌తో కూడిన టెక్స్ట్ డేటాసెట్‌పై ChatGPT ట్రైనింగ్ పొందింది. అయినప్పటికీ, చాట్ జీపీటీమూలాలు 2021లోనే ముగిశాయి. దాంతో ఇటీవలి ప్రపంచ సంఘటనలు, పరిశోధనల కవరేజీని పరిమితం చేసింది.

Data Sources : Google Bard : బార్డ్ కామన్ క్రాల్, వికీపీడియా, డాక్యుమెంట్‌లు, ఆన్‌లైన్ సంభాషణలు, డైలాగ్‌లతో కూడిన డేటాసెట్ అయిన ఇన్ఫినిసెట్‌పై ట్రైనింగ్ పొందింది. నివేదికల ప్రకారం, ఎంక్వైరీలు, లేటెస్ట్ పరిశోధనలకు అత్యంత ప్రస్తుత రెస్పాన్స్‌లను గుర్తించడానికి బార్డ్ రియల్ టైమ్ ఇంటర్నెట్‌ను సెర్చ్ చేయగలదు.

Price : ChatGPT యూజర్లకు ఉచితంగా అందిస్తుంది. ChatGPT Plus ధర నెలకు 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

Google Bard : గూగుల్ బార్డ్ ఏఐని యూజర్లు అందరికి ఉచితంగా అందిస్తుంది.

బార్డ్ డైలాగ్స్ క్రియేట్ చేస్తుంది.. ChatGPT టెక్స్ట్ మాత్రమే :
ఈ రెండు మోడల్‌లు ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్‌తో పనిచేస్తాయి. సీక్వెన్షియల్ ఇన్‌పుట్‌ను మాత్రమే న్యూరల్ నెట్‌వర్క్ ప్రాసెస్ చేయగలదు. అయితే, (GPT-3), GPT-4 ఇంటర్నెట్ నుంచి సేకరించిన అపారమైన టెక్స్ట్ డేటాసెట్‌పై (ఓపెన్ ఇంటర్నెట్ నుంచి పుస్తకాలు, స్టోరీలు, డాక్యుమెంట్లతో సహా) ట్రైనింగ్ పొందాయి. LaMDA డైలాగ్స్, సంభాషణలపై దృష్టి సారించే డేటాసెట్ ఇన్‌ఫినిసెట్‌పై ట్రైనింగ్ పొందింది. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సందర్భోచితంగా సమాధానాలను ఇచ్చేలా LaMDA ట్రైనింగ్ పొందింది.

ChatGPT భారీగా టెక్స్ట్ క్రియేట్ చేయగలదు.. బార్డ్ డేటాను వెబ్‌లో వెతకగలదు :
చాట్‌జీపీటీ మాదిరిగానే వినియోగదారులు వంటకాలు, పార్టీ ప్లానింగ్ టిప్స్ లేదా హిస్టరికల్ ఈవెంట్స్ వంటి వివిధ అంశాలపై బార్డ్ ప్రశ్నలను అడగవచ్చు. అయినప్పటికీ, ఇందులో ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే… బార్డ్ అడిగిన ప్రశ్నలను ఇంటర్నెట్ నుంచి అందించగలదు. రియల్-టైమ్ డేటాను కూడా అందించగలదు. ChatGPT ఇప్పటికీ 2021 విధానాలతోనే పనిచేస్తోంది. కాబట్టి ఇదే బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ, పేమెంట్ వెర్షన్ ఉపయోగిస్తే కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది.

గూగుల్ బార్డ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది :
బార్డ్ యూజర్ ఇంటర్‌ఫేస్ యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ChatGPT చంకీ టెక్స్ట్ కన్నా ఫార్మాట్ చేసిన టెక్స్ట్ స్కాన్ చేయడం చాలా సులభమని చెప్పవచ్చు. వినియోగదారులు అడిగిన ప్రశ్నలను ఎడిట్ చేయొచ్చు. ప్రశ్నను బట్టి అవసరమైన డేటాను వీక్షించేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Read Also : Google Gemini AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐని తలదన్నేలా గూగుల్ మల్టీ మోడల్ జెమిని.. టెక్ట్స్ మాత్రమే కాదు.. ఫొటోలను క్రియేట్ చేయగలదు..!