Delhi Airport T3 : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ T3లో 5G కనెక్టవిటీ.. విమాన ప్రయాణికులు 20 రెట్లు ఫాస్ట్ ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోవచ్చు!

Delhi Airport T3 : దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport) భారత మార్కెట్లో ఫస్ట్ 5G-రెడీ ఎయిర్‌పోర్ట్‌గా అవతరించింది. ప్రయాణీకుల కోసం 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించేందుకు టెర్మినల్ 3 రెడీగా ఉందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.

Delhi Airport T3 : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ T3లో 5G కనెక్టవిటీ.. విమాన ప్రయాణికులు 20 రెట్లు ఫాస్ట్ ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోవచ్చు!

Delhi Airport T3 is now 5G-ready, promises 20-times faster connectivity to passengers

Delhi Airport T3 : దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport) భారత మార్కెట్లో ఫస్ట్ 5G-రెడీ ఎయిర్‌పోర్ట్‌గా అవతరించింది. ప్రయాణీకుల కోసం 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించేందుకు టెర్మినల్ 3 రెడీగా ఉందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎయిర్‌టెల్ (Airtel), జియో (Reliance Jio) వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 5G నెట్‌వర్క్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో ఈ 5G కనెక్టవిటీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికులు త్వరలో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న Wi-Fi సిస్టమ్ కంటే 5G నెట్‌వర్క్ 20 రెట్లు వేగవంతమైన డేటా వేగాన్ని అందిస్తుందని అథారిటీ చెబుతోంది.

ప్రయాణికుల స్మార్ట్‌ఫోన్‌లలో 5G కనెక్టివిటీ ఉన్న ప్రయాణీకులు మెరుగైన సిగ్నల్ స్ట్రెంగ్త్, డొమెస్టిక్ డిపార్చర్ పీర్‌లో స్పీడ్ కనెక్టివిటీని టెర్మినల్ 3 వద్ద ఇంటర్నేషనల్ అరైవల్ బ్యాగేజ్ ఏరియా, T3 అరైవేస్, మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ (MLCP)ని అనుభవిస్తారని DIAL తెలిపింది. 5G నెట్‌వర్క్ కనెక్టివిటీ దశలవారీగా T3లో అందుబాటులోకి వస్తుంది.

Delhi Airport T3 is now 5G-ready, promises 20-times faster connectivity to passengers

Delhi Airport T3 is now 5G-ready, promises 20-times faster connectivity to passengers

5G నెట్‌వర్క్ నిజమైతే.. విమానాశ్రయంలో ప్రయాణీకులు వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్, స్ట్రీమింగ్ జీరో బఫరింగ్‌ను పొందవచ్చు. 5G కనెక్టివిటీ ప్రయాణీకుల ప్రాసెసింగ్, బ్యాగేజీ నిర్వహణతో సహా విమానాశ్రయ కార్యకలాపాలు మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలుంటుంది. భారత్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1న అధికారికంగా 5G సర్వీసులను ప్రారంభించనున్నారు.

అయితే, సాధారణ 5G సర్వీసులు అందుబాటులోకి రావడానికి మరికొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన నగరాల్లో ప్రధానమంత్రి 5G సర్వీసులను ప్రారంభించనున్నారు. రాబోయే రెండేళ్లలో దేశం మొత్తంగా 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

అదే సమయంలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) ఆరవ ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. IMC 2022 న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్ 1-4 వరకు “న్యూ డిజిటల్ యూనివర్స్ అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. అక్టోబర్ 12 నాటికి దేశంలో 5G సర్వీసులను త్వరితగతిన లాంచ్ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. సరసమైన ధరలకు 5G సర్వీసులు అందజేసేలా ప్రభుత్వం హామీ ఇస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Delhi Airport T3 is now 5G-ready, promises 20-times faster connectivity to passengers

Delhi Airport T3 is now 5G-ready, promises 20-times faster connectivity to passengers

5G లాంచ్‌కు ముందు.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) దేశంలో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలను సిద్ధం చేశాయి. రిలయన్స్ దీపావళి సందర్భంగా దశలవారీగా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. టెలికాం ఆపరేటర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5G కనెక్టివిటీని విస్తరించాలని భావిస్తోంది. ఎయిర్‌టెల్ కూడా వచ్చే నెలలో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. ఎయిర్‌టెల్ యూజర్లు ప్రస్తుత 4G SIMలో 5జీ కనెక్టివిటీని పొందుతారు. 5G సర్వీసులను పొందడానికి వినియోగదారులు సిమ్ కార్డ్‌ని మార్చాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Delhi airport: పైలట్ల సమ్మెతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల అవస్థలు.. ఆదుకోండి అంటూ వినతి