Facebook : స్మార్ట్ గ్లాసెస్‌‌తో వీడియో, ఫొటోలు క్లిక్..రికార్డు చేయొచ్చు!

స్మార్ట్ కళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు తీయడమే కాకుండా..ఇతరులతో కూడా పంచుకోవచ్చు. అవును ఫేస్ బుక్...సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది.

Facebook : స్మార్ట్ గ్లాసెస్‌‌తో వీడియో, ఫొటోలు క్లిక్..రికార్డు చేయొచ్చు!

Fb Glases

Ray-Ban Smart Glasses : టెక్నాలజీ రోజురోజుకు మారిపోతోంది. కొత్త కొత్త సాధానాలు వచ్చేస్తున్నాయి. వాటితో సాధ్యం కాని పనులు కూడా చేయొచ్చు. అత్యాధునికంగా తయారు చేసిన వస్తువులకు ఫుల్ డిమాండ్స్ ఉంటున్నాయి. తాజాగా..స్మార్ట్ కళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు తీయడమే కాకుండా..ఇతరులతో కూడా పంచుకోవచ్చు. అవును ఫేస్ బుక్…సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. కళ్లద్దాల తయారీ కంపెనీ…రే బాన్ తో జత కట్టింది. రే బాన్ తో ఫేస్ బుక్ తన మొట్టమొదటి స్మార్ట్ కళ్లద్దాలను రూపొందించింది. వీటితో…ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. కళ్లజోడుతో ఏదైనా ఫేస్ బుక్ లో ఇతరులతో లైవ్ లో పంచుకోవచ్చు.

Read More : RIL Share : రిలయన్స్‌ను దెబ్బతీసిన జియోఫోన్‌

ఇక దీని విశేషాలకు వస్తే…

రేబాన్ స్మార్ట్ గ్లాస్ లో 5 మెగా పిక్సెల్ ఇంటిగ్రేటెడ్ కెమెరా ఉంది. స్మార్ట్ గ్లాసులతో వాటిని రికార్డు చేయవచ్చు. ఫొటోలు క్లిక్ చేయడంతో పాటు..ఫేస్ బుక్ అసిస్టెంట్ వాయిస్ ఆదేశాలతో క్యాప్చర్ బటన్ లేదా హ్యాండ్స్ ఫ్రీని ఉపయోగించి…30 సెకన్ల వరకు వీడియోను రికార్డు చేసే అవకాశం ఉంది. హార్డ్ వైర్డ్ క్యాప్చర్ LED లైట్ లు వెలుగుతాయని ఫేస్ బుక్ తన బ్లాగ్ లో తెలిపింది. కాల్ లు, వీడియోల కోసం మెరుగైన వాయిస్, సౌండ్ ట్రాన్స్ మిషన్ ను అందించే మూడు మైక్రో ఫోన్ ఆడియో శ్రేణులను కలిగి ఉంటుంది. స్మార్ట్ గ్లాసెస్ లో బీమ్ ఫార్మింగ్ టెక్నాలజీని ఉపయోగించింది.

Read More : Sansad TV : వస్తోంది..! లోక్‌సభ, రాజ్యసభ ఛానెళ్ల స్థానంలో కొత్త టీవీ

ఫేస్ బుక్ వ్యూ యాప్ తో అనుసంధానించబడడంతో వినియోగదారులు స్నేహితులు, సోషల్ మీడియా అనుచరులతో కథలు, జ్ఞాపకాలను పంచుకోవచ్చు. గ్లాసెస్ లో క్యాప్చర్ చేయబడిన కంటెంట్ ను దిగుమతి, కంటెంట్ ను దిగుమతి చేయడానికి..ఎడిట్ చేయడానికి..వీటిని షేర్ చేసుకొనేందుకు అనుమతినిస్తుంది. రే బాన్ స్టైల్స్ లో 20 రూపాల్లో వస్తాయి. ఇక దీని ధర రూ. 299 డాలర్లు (రూ. 21 వేలు) ఉంటుందని తెలుస్తోంది. అయితే…స్మార్ట్ గ్లాసెస్ భారతదేశంలో లాంచ్ చేస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.