Sansad TV : వస్తోంది..! లోక్‌సభ, రాజ్యసభ ఛానెళ్ల స్థానంలో కొత్త టీవీ

పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నప్పుడు లోక్ సభ, రాజ్యసభ ఛానెళ్లలో సెపరేట్ గా లైవ్ వస్తుండేది. దానికి అనుగుణంగానే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం.....

Sansad TV : వస్తోంది..! లోక్‌సభ, రాజ్యసభ ఛానెళ్ల స్థానంలో  కొత్త టీవీ

Sansad Tv

Sansad TV : పార్లమెంట్ సమావేశాలు  లోక్ సభ, రాజ్యసభ టీవీల్లో ప్రసారం అవుతుంటాయి. ఐతే.. ఈ రెండు టీవీలను మెర్జ్ చేస్తూ… కొత్త టీవీ ఛానెల్ ను ప్రారంభిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సంసద్ టీవీ(Sansad TV)ని సెప్టెంబర్ 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15   బుధవారం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంసద్ టీవీ ఛానెల్ ను ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ బిల్డింగ్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

NASA: ప్రతీ 45 నిమిషాలకు సూర్యోదయం.. సూర్యాస్తమయాలు మారుతుంటాయక్కడ

ఆర్థిక వేత్త వివేక్ దేవ్రాయ్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్, అడ్వకేట్ హేమంత్ బత్రాలు హోస్ట్ లుగా.. సంసద్ టీవీలో చర్చా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ కానున్నాయి. ప్రజాస్వామ్యం, విలువలు, దేశ గొప్పదనం, కీలక ఘట్టాలపై ప్రసారాలు ఉంటాయని సమాచారం.

పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నప్పుడు లోక్ సభ, రాజ్యసభ ఛానెళ్లలో సెపరేట్ గా లైవ్ వస్తుండేది. దానికి అనుగుణంగానే పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం సంసద్ టీవీకి అనుబంధంగా మరో ఛానెల్ లోనూ ప్రసారాలు వస్తుంటాయి.  ఒకదాంట్లో లోక్ సభ, మరోదాంట్లో రాజ్యసభ సమావేశాల లైవ్ వస్తుంది. పార్లమెంట్ సెషన్ ముగిసిన తర్వాత… ప్రసారాలు ఒక్క ఛానెల్ కే పరిమితం అవుతాయి. సంసద్ ఛానెల్ కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టెక్స్ టైల్ శాఖ సెక్రటరీ రవి కపూర్ సీఈఓగా, లోక్ సభ జాయింట్ సెక్రటరీ మనోజ్ అరోరా OSDగా వ్యవహరించనున్నారు.

Third Wave : థర్డ్ వేవ్ రాదు.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ షురూ