NASA: ప్రతీ 45 నిమిషాలకు సూర్యోదయం.. సూర్యాస్తమయాలు మారుతుంటాయక్కడ

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) భూమి చుట్టూ ప్రతి 90నిముషాలకోసారి కక్ష్యను పూర్తి చేసుకుంటుంటుంది. ఫలితంగా ఆస్ట్రోనాట్స్ 45నిమిషాలకోసారి..

NASA: ప్రతీ 45 నిమిషాలకు సూర్యోదయం.. సూర్యాస్తమయాలు మారుతుంటాయక్కడ

Sunset Sunrise

NASA: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) భూమి చుట్టూ ప్రతి 90నిముషాలకోసారి కక్ష్యను పూర్తి చేసుకుంటుంటుంది. ఫలితంగా ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు) 45నిమిషాలకోసారి సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తారని నాసా నిపుణులు అంటున్నారు.

రీసెంట్ గా జరిగిన స్పేస్ వాక్ (సోమవారం సెప్టెంబర్ 12) గురించి ట్విట్టర్ యూజర్ ఇలా రాసుకొచ్చారు. స్పేస్ సూట్స్ లో ఉన్నప్పుడు ఏదైనా టెంపరేచర్ డిఫరెన్స్ కనిపిస్తుందా అని నెటిజన్ నుంచి సందేహం వచ్చిందట.

Nasa Astronauts

Nasa Astronauts

దీనికి నాసా ఇచ్చిన సమాధానం.. సూర్యోదయం సమయంలో +250డిగ్రీలు ఫారెన్ హీట్ ఉంటే.. సూర్యాస్తమయ సమయంలో -250డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉన్నట్లే. అందుకే స్పేస్ సూట్లను కూలింగ్ గార్మెంట్స్ తో పాటు ప్రొటెక్ట్‌డ్ లేయర్లతో రెడీ చేస్తారు. ఫలితంగా టెంపరేచర్ డిఫరెన్స్ సంబంధం లేకుండా కూల్ గానూ కంఫర్ట్ గానూ ఉంచుతుంది.

Read Also: నా కోడిని చంపేసారు.. పోస్ట్ మార్టం చేయండి.. మాజీ ఎమ్మెల్యే కొడుకు డిమాండ్

ఈ సంవత్సరంలో ఇది 12వ స్పేస్ వాక్. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కు చెందిన అకిహికో హోషిడె, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన థామస్ పెకెట్ ఈ స్పేస్ వాక్ లో పొల్గొన్నారు. తొలిసారి రెండు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కలిసి నిర్వహించారు. వ్యక్తిగతంగా హోషిడేకు ఇది నాలుగో స్సేస్ వాక్ కాగా, పెస్కెట్ కు ఆరోది. వారిద్దరూ కలిసి వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి.