Google Mapsలో కొత్త ఆప్షన్: ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటి.. గూగుల్ మాప్స్ సర్వీసు. గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు.

  • Published By: sreehari ,Published On : March 27, 2019 / 11:31 AM IST
Google Mapsలో కొత్త ఆప్షన్: ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటి.. గూగుల్ మాప్స్ సర్వీసు. గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు.

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటి.. గూగుల్ మాప్స్ సర్వీసు. గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. నేవిగేషన్ యాప్ ద్వారా ప్రాంతాల వారీగా లోకేషన్ బేసడ్ సర్వీసులను వినియోగించుకోవచ్చు. బిజినెస్ పరంగా గూగుల్ మ్యాప్స్  ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రొడక్ట్ కావొచ్చు, కంపెనీ కావొచ్చు. సంస్థ ఏదైనా కావొచ్చు.. ఇప్పుడు ప్రతిఒక్కరూ గూగుల్ మ్యాప్స్  ను ఫాలో అవుతున్నారు.

ఎక్కడికి పోవాలన్నా.. ఏదైనా ప్రమోట్ చేయాలన్నా.. గూగుల్ మ్యాప్స్  తోనే పని. ప్రపంచవ్యాప్తంగా ఈ గూగుల్ మ్యాప్స్ సర్వీసు వల్లే ఎంతో బిజినెస్ నడుస్తోంది. బిజినెస్ పీపుల్స్ కోసం గూగుల్ మ్యాప్స్  లో ఓ కొత్త ఆప్షన్ వచ్చింది. అదే.. పబ్లిక్ ఈవెంట్స్ ఆప్షన్. గూగుల్ మ్యాప్స్  నేవిగేషన్ యాప్ ద్వారా పబ్లిక్ ఈవెంట్ ను యూజర్లు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 
Read Also : కమింగ్ సూన్ : 100GBతో.. జియో ట్రిపుల్ ప్లే ప్లాన్!

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ నుంచి నేవిగేషన్ యాప్ లో పబ్లిక్ ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ తో బిజినెస్, ఈవెంట్ మేనేజర్లు తమ సర్వీసుపై డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫీచర్ లైవ్ లో ఉంది. యూజర్లు ఏదైనా పబ్లిక్ ఈవెంట్ క్రియేట్ చేస్తే.. 30 నిమిషాల పాటు గూగుల్ మ్యాప్స్  లో లైవ్ ఉంచవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేదానిపై క్లారిటీ లేదు. ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాప్స్ దేశ సరిహద్దులు, రాష్ట్రం, నగరం అన్ని అప్షన్లను గూగుల్ మళ్లీ వేర్వేరుగా ప్రవేశపెట్టింది. కొన్నినెలల క్రితం ఈ ఫీచర్ ను ఎలాంటి వార్నింగ్ లేకుండానే మ్యాప్స్  నుంచి తొలగించింది. ఆ తర్వాత మళ్లీ ఆండ్రాయిడ్ పోలీస్ లో తొలిసారి ఈవెంట్స్ దర్శనమిచ్చింది. 

ఈ కొత్త ‘ఈవెంట్స్’ ఫీచర్ (వర్షన్ 10.12.1) ను ఆండ్రాయిడ్ పోలిస్ ఫస్ట్ లో ప్రవేశపెట్టారు. ఈ యాప్ కు సంబంధించి సపోర్ట్ పేజీని కూడా గూగుల్ అప్ డేట్ చేసింది. ఇందులో కొత్త ఫీచర్ కు సంబంధించిన విషయాలను అప్ డేట్ చేసింది. ఈ సపోర్ట్ పేజీలో.. ఈవెంట్స్ ఫీచర్ అన్ని రీజియన్లలో అందుబాటులో లేదని మెన్షన్ చేశారు. 

గూగుల్ మ్యాప్స్ లో పబ్లిక్ ఈవెంట్స్ క్రియేట్ చేయాలంటే?
* ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ ను ఓపెన్ చేయండి. 
* కాంట్రిబ్యూట్ పై క్లిక్ చేయగానే.. ఈవెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. 
* ఇక్కడ Add a public ఈవెంట్ ను యాడ్ చేయాలి. 
* ఈవెంట్ పేరు, లొకేషన్ కూడా ట్యాగ్ చేయొచ్చు. సమయం, తేదీలను ఎంటర్ చేయాలి
* ఇమేజ్ యాడ్ చేయడానికి ఓ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీ ఈవెంట్ వివరాలు, డిస్క్కప్షన్, ఈవెంట్ తేదీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 
* ఈవెంట్ కు ఇమేజ్ యాడ్ చేసే క్రమంలో కొన్ని సమస్యలు ఉన్నట్టు ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్స్ తెలిపింది. 

పబ్లిక్ ఈవెంట్స్.. ఒకసారి గూగుల్ మ్యాప్ యాప్ లో సేవ్ చేశాక.. ఎప్పుడంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. 
* కాంట్రిబ్యూట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 
* ఈవెంట్స్ బటన్ పై క్లిక్ చేయాలి.
* సెలెక్ట్ యువర్ ఈవెంట్ 
* ఎడిట్ దిస్ ఈవెంట్ 
* డిలీట్ దిస్ ఈవెంట్ ఆప్షన్ కూడా ఉంది.
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?