యాపిల్ యాప్ స్టోర్ నుంచి గూగుల్ పే అవుట్!!

యాపిల్ యాప్ స్టోర్ నుంచి గూగుల్ పే అవుట్!!

ఇండియాలో మనీ ట్రాన్సాక్షన్ కోసం విచ్ఛలవిడిగా వాడేస్తున్న Google Pay (తేజ్ యాప్) యాప్ ను యాప్ స్టోర్ నుంచి తొలగించారు. డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవాలనుకునే యాపిల్ ఇండియన్ యూజర్లకు అందుబాటులో లేనట్లే. యాప్ స్టోర్‍‌లో గూగుల్ పే అని సెర్చ్ చేస్తే మీకు ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్ లు మాత్రమే కానీ గూగుల్ పే దొరకదు.

ఆగష్టు నెలలో యాప్ చాలా ఇబ్బందులు పెట్టింది. చాలా మంది ఇష్యూ లేవనెత్తినప్పటికీ.. కొద్ది గంటల్లోనే సమస్యను చక్కదిద్దారు. దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. గూగుల్ పే యాపిల్ యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించాం. ఓ ఇష్యూ ఉండడంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆండ్రాయిడ్ వర్షన్ లో మాత్రం గూగుల్ పే యాప్ అందుబాటులోనే ఉందని వెల్లడించాడు.



యాపిల్ ఫోన్ యూజర్లలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ సమస్య ఎదురైందని కొందరు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా సమస్య నుంచి బయటపడాలని మా టీంలు కష్టపడుతున్నాయి. ఎఫెక్ట్ కు గురైన యూజర్లు హెల్ప్ కోసం గూగుల్ పే సపోర్ట్ ద్వారా సంప్రదించవచ్చు. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికార ప్రతినిధి వెల్లడించారు.

వీలైనంత త్వరలోనే యాప్ స్టోర్‌లో ఉండే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ యాప్ ఇంకా స్టోర్ లో కనిపిస్తున్నా దానిని క్లిక్ చేసినప్పుడు అది స్టోర్ కు కనెక్ట్ కాదని కన్ఫామక్ చేశారు. మరికొద్ది రోజుల వరకూ యాపిల్ యూజర్లు గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట.