Google Pixel 8 Series : టెన్సర్ G3 చిప్‌సెట్‌, 12GB ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Google Pixel 8 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 Series) తర్వాత గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ (Google Pixel 8 Series) లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఈ పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G3 చిప్‌సెట్‌తో పాటు 12GB RAMని కలిగి ఉండనుంది.

Google Pixel 8 Series : టెన్సర్ G3 చిప్‌సెట్‌, 12GB ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Google Pixel 8 tipped to come with Tensor G3 chipset, 12GB RAM

Google Pixel 8 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 Series) తర్వాత గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌ (Google Pixel 8 Series) లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఈ పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G3 చిప్‌సెట్‌తో పాటు 12GB RAMని కలిగి ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌లో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో వంటి రెండు ఫోన్‌లను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. పిక్సెల్ 8తో పాటు, పిక్సెల్ 7 సిరీస్ ట్రిమ్ డౌన్ వెర్షన్ 7aపై కూడా గూగుల్ పనిచేస్తోంది. మిడ్-రేంజ్ ఆఫర్ శక్తివంతమైన ఫీచర్లు, మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుంది.

Google Pixel 8 : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Google Pixel 8 అప్‌గ్రేడ్ వెర్షన్ Tensor G3 చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు. ఈ డివైజ్ 12GB RAM హై కాన్ఫిగరేషన్‌తో రానుంది. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. పిక్సెల్ ప్రో మోడల్ 2822 x 1344 పిక్సెల్‌ల డిస్‌ప్లే రిజల్యూషన్‌తో రానుంది. పిక్సెల్ 8 స్టాండర్డ్ 2268 x 1080 రిజల్యూషన్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. Google I/0 2023 సమయంలో డివైజ్‌లను Google అందించనుందని భావిస్తున్నారు.

Google Pixel 8 tipped to come with Tensor G3 chipset, 12GB RAM

Google Pixel 8 tipped to come with Tensor G3 chipset, 12GB RAM

Google Pixel 7 : స్పెసిఫికేషన్‌లు :
కంపెనీ లేటెస్ట్ ప్రీమియం ఆఫర్ Google Pixel 7, 6.32-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2,400 x 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది. డిస్ప్లే 90hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. పిక్సెల్ 7 టెన్సర్ G2తో పాటు 8GB వరకు RAM, 256GB వరకు స్టోరేజీతో అందించనుంది. ఈ డివైజ్ 4,355mAh Li-Ion బ్యాటరీని కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : జియో 5G మాదిరిగానే.. మరిన్ని నగరాల్లోకి ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్.. మీ సిటీలో 5G వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు!