HotHit App : ఈ OTT పోర్న్ యాప్ నుంచే.. రాజ్ కుంద్రా అకౌంట్లోకి లక్షల్లో పేమెంట్స్!

పోర్నోగ్రఫీ రాకెట్‌ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా Hot Hit అనే పోర్న్ యాప్ నుంచి రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ ఓటీటీ యాప్ ద్వారా బ్యాంకు అకౌంట్లోకి రోజువారీ పేమెంట్లు కింద రూ.9.65 లక్షల వరకు క్రెడిట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

10TV Telugu News

HotHit OTT porn app : పోర్నోగ్రఫీ రాకెట్‌ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా Hot Hit అనే పోర్న్ యాప్ నుంచి రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ ఓటీటీ యాప్ ద్వారా ఆయన బ్యాంకు అకౌంట్లోకి రోజువారీ పేమెంట్లు కింద రూ.9.65 లక్షల వరకు వస్తున్నాయట. పోర్నోగ్రఫీ రాకెట్‌‌ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ఓటీటీ పోర్న్ యాప్ విషయం వెలుగులోకి వచ్చింది. Google Play Storeలో HotHit మూవీస్ యాప్‌ అనే పేరుతో (Best Indian Movies And Web series) అందుబాటులో ఉంది. HotHit Moves and Originals లోని వీడియో కంటెంట్ వాచ్ చేయాలంటే సబ్ స్ర్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ పేమెంట్స్ మొత్తం Paykun Payment method ద్వారా ఇన్ స్టంట్ యాక్సస్ చేసుకునే వీలుంది.

అంతేకాదు.. ఈ యాప్ సబ్ స్ర్కిప్షన్ అనేక ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ప్రీమియం రూ.199తో 28 రోజుల వ్యాలిడిటీ, ఫుల్ HD లేదా సినిమాటిక్ కంటెంట్, రూ.249తో 45 రోజుల వరకు Full HD కంటెంట్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌లో ఇంకేమి ఉన్నాయంటే.. ఇండియన్ మూవీస్ బెస్ట్ కలెక్షన్, షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఇలా అన్నీ క్యాటగిరీల్లో ఉన్నాయి. ప్రతి నెలా అన్ లిమిటెడ్ వీడియోల కోసం ఈ OTTలో సబ్ స్ర్కిప్షన్ ఆప్షన్ అందిస్తోంది. అదే.. About Us సెక్షన్ లో మాత్రం.. HotHit వెబ్ సైట్, యాప్ గురించి వివరణ ఉంది. ఇదొక ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం.. వందలాది అడల్ట్ మూవీలు, హిందీ వెబ్ సిరీస్ లు పొందవచ్చునని ఉంది. HotHit Originalsతో పాటు స్ట్రీమి కంటెంట్ కూడా అందిస్తామని ఉంది.

యూకేలో వీడియోలు అప్‌లోడ్ :
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పోర్న్ రాకెట్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. సినిమా ఛాన్సుల కోసం వచ్చినవారితో నీలిచిత్రాల్లో నగ్నంగా నటించాలంటూ బలవంతం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిల్మ్ వీడియోలన్నీ పెయిడ్ వెబ్ సైట్లు, మొబైల్ అప్లికేషన్లలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారు. ఈ పోర్న్ రాకెట్ లో Gehna Vasishth అనే వ్యక్తి కీలక పాత్రగా పోలీసులు గుర్తించారు. యూకేలో మొబైల్ యాప్స్ (Eightshots, Nuefliks, HotHit) ద్వారా ఈ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. ఈ కేసులో కుంద్రాతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు రాజ్ కుంద్రా మొబైల్ రికార్డును పరిశీలించగా.. HotHit యాప్ నుంచి ఆయనకు రెగ్యులర్ పేమెంట్స్ వస్తున్నట్టు గుర్తించారు.

కుంద్రా అకౌంట్లో లక్షల్లో క్రెడిట్ :
పోర్న్ రాకెట్ ను అరెస్ట్ చేయడానికి ముందు కుంద్రా బ్యాంకు అకౌంట్లోకి HotHit నుంచి (ఫిబ్రవరి 3) రూ.2.7 లక్షలు క్రెడిట్ అయ్యాయి. అలాగే జనవరి 23న అదే బ్యాంకు అకౌంట్లోకి రూ.95వేలు వచ్చాయి. జనవరి 20న రూ. 1లక్ష, జనవరి 13న రూ.2 లక్షలు, జనవరి 10న రూ. 3 లక్షలు చొప్పన క్రెడిట్ అయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కుంద్రా, ఆయన బామరిది ప్రదీప్ బాక్సి ఇద్దరికి రెండు కంపెనీలు ఉండగా.. HotShots Digital Entertainment అనే మొబైల్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ Kenrin Ltd డెవలప్ చేసినట్టుగా ఉంది. ఈ యాప్ HotShots పేరుతో పోర్నోగ్రఫీ కంటెంట్ పంపిణీ చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను నిషేధించాయి. అయినప్పటికీ చాలా వెబ్ సైట్లలో ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (APK) అందుబాటులో ఉంది. పోర్న్ రాకెట్ గుట్టుబయటపడిన తర్వాత ముంబై పోలీసులు కోర్టు అనుమతితో రాజ్ కుంద్రా అఫీసుల్లో దాడులు చేశారు.. అక్కడ కొన్ని క్లిప్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుంద్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

10TV Telugu News