Whatsapp Payment : వాట్సాప్‌లో పేమెంట్ హిస్టరీని ఎలా చూడాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Payment : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) భారత మార్కెట్లో నవంబర్ 2020 నుంచి పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. చివరికి 2021లో వాట్సాప్ యూజర్లు అందరికి విస్తరించింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లను UPI ద్వారా లింక్ చేయవచ్చు.

Whatsapp Payment : వాట్సాప్‌లో పేమెంట్ హిస్టరీని ఎలా చూడాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Payment _ How to view payment history on WhatsApp

Whatsapp Payment : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) భారత మార్కెట్లో నవంబర్ 2020 నుంచి పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. చివరికి 2021లో వాట్సాప్ యూజర్లు అందరికి విస్తరించింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లను UPI ద్వారా లింక్ చేయవచ్చు. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పేమెంట్లు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. వాట్సాప్ పేమెంట్లు బ్యాంక్-టు-బ్యాంక్ నగదు బదిలీలను ప్రారంభించేందుకు UPIని ఉపయోగిస్తాయి.

బ్యాంక్ అకౌంట్ డేటాను గుర్తించడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ యూజర్ అకౌంటుతో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తుంది. డబ్బు పంపడం లేదా స్వీకరించడం కాకుండా, WhatsApp యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను చూడటానికి, పేమెంట్ నివేదించడానికి వాట్సాప్‌లో పేమెంట్ హిస్టరీని కూడా వీక్షించడానికి అనుమతిస్తుంది.WhatsAppలో పేమెంట్ హిస్టరీని వీక్షించడానికి దశల వారీగా అందిస్తున్నాము. అవేంటో ఓసారి చూద్దాం..

Androidలో WhatsApp పేమెంట్ హిస్టరీని చూడాలంటే :

* మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* మరిన్ని ఆప్షన్లపై Tap చేయండి.
* పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని ఆపై పేమెంట్ హిస్టరీని Tap చేయండి.
* పేమెంట్ హిస్టరీని వీక్షించేందుకు See all to view ఆప్షన్ Tap చేయండి.

Read Also : WhatsApp for iPhone Users : 2023లో ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మల్టీ టాస్క్ ఎంతో ఈజీ..!

iPhoneలో WhatsApp పేమెంట్ హిస్టరీని చూడాలంటే :

* మీ డివైజ్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* సెట్టింగ్‌లపై Tap చేయండి.
* ఇప్పుడు పేమెంట్లపై Tap చేయండి.
* ఆ తర్వాత, పేమెంట్ హిస్టరీపై Tap చేయండి.
* పేమెంట్ హిస్టరీని వీక్షించడానికి See all to view చూడండి.

Whatsapp Payment _ How to view payment history on WhatsApp

Whatsapp Payment _ How to view payment history on WhatsApp

మీరు పేమెంట్లను గుర్తించనట్లయితే వెంటనే నివేదించవచ్చు. అలాగే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.

* మీ మొబైల్ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* iPhone కోసం Settings, Android కోసం మరిన్ని ఆప్షన్లపై Tap చేయండి.
* పేమెంట్ హిస్టరీ కింద Payments సెక్షన్‌కు వెళ్లండి.
* మీరు నివేదించిన Payments ఆప్షన్ Tap చేయండి.

ఇంతలో, WhatsApp iPhoneలో వీడియో కాల్స్ కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ధృవీకరించింది. బ్లాగ్ పోస్ట్‌లో, iOSలోని పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ 2023లో యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ యూజర్లు WhatsApp వీడియో కాల్‌లో ఉన్నప్పుడు మల్టీటాస్క్ చేసేందుకు ఇతర యాప్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు బీటా టెస్టింగ్‌లో ఉంది. 2023లో విడుదల కానుంది. వాట్సాప్ కాల్‌లో ఉన్నప్పుడు సులభంగా మల్టీ టాస్క్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Pay India : వాట్సాప్ పే ఇండియా హెడ్ రాజీనామా.. కంపెనీలో చేరిన 4 నెలలకే గుడ్‌బై.. ఎందుకో తెలుసా?