WhatsApp Pay India : వాట్సాప్ పే ఇండియా హెడ్ రాజీనామా.. కంపెనీలో చేరిన 4 నెలలకే గుడ్‌బై.. ఎందుకో తెలుసా?

WhatsApp Pay India : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇండియాలోని మరో టాప్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. వాట్సాప్ పే ఇండియా హెడ్ వినయ్ చోలేట్టి (Vinay Choletti) లింక్‌డిన్ పోస్ట్ ద్వారా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు.

WhatsApp Pay India : వాట్సాప్ పే ఇండియా హెడ్ రాజీనామా.. కంపెనీలో చేరిన 4 నెలలకే గుడ్‌బై.. ఎందుకో తెలుసా?

WhatsApp Pay India head resigns just four months after taking the job

WhatsApp Pay India : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇండియాలోని మరో టాప్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. వాట్సాప్ పే ఇండియా హెడ్ వినయ్ చోలేట్టి (Vinay Choletti) లింక్‌డిన్ పోస్ట్ ద్వారా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. వాట్సాప్ పే (Whatsapp Pay)లో మర్చంట్స్ పేమెంట్స్ హెడ్‌గా అక్టోబర్ 2021లో చొలెట్టి తిరిగి సంస్థలో చేరారు.

ఆ తర్వాత సెప్టెంబర్ 2022లో వాట్సాప్ పే (Whatsapp Pay India) ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఈ రోజు వాట్సాప్ పేలో నా చివరి రోజు.. నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను.. భారత్ వాట్సాప్ స్థాయి, ప్రభావాన్ని చూడటమనేది ఒక అద్భుతమైన అనుభవమని గర్వంగా చెప్పగలను.

గత ఏడాదిలో వ్యక్తిగతంగా ఒక గొప్ప ప్రయాణంతో పాటు ఉత్సాహాన్ని పొందాను’ అని చొలెట్టి చెప్పుకొచ్చారు. వాట్సాప్‌లో బెంగుళూరు మెట్రో కోసం QR టిక్కెట్లు వంటి కొన్ని గ్లోబల్ ఫస్ట్ పేమెంట్స్ వినియోగ కేసులను ప్రారంభించారు. వాట్సాప్ పేని ఉపయోగించి కస్టమర్‌లు కొత్త వినియోగ కేసులను స్వీకరించవచ్చును. నా జీవితాంతం గర్వంగా ఈ బ్యాడ్జ్‌లను ధరిస్తానని చోలేట్టి లింక్‌డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

WhatsApp Pay India head resigns just four months after taking the job

WhatsApp Pay India head resigns just four months after taking the job

Read Also : WhatsApp Search Groups : వాట్సాప్ చాట్ లిస్టులో ఇకపై గ్రూపులను ఈజీగా సెర్చ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

చోలేట్టి తర్వాత ఏ కంపెనీలో జాయిన్ కాబోతున్నారు అనేది భవిష్యత్తు ప్రణాళికలను రివీల్ చేయలేదు. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్, అసాధారణంగా మార్చగల శక్తి వాట్సాప్‌కు ఉందని నేను గట్టిగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో దాని సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చేదిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉందని చోలెట్టి పోస్ట్‌లో పేర్కొన్నారు.

వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ (Abhijit Bose) మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్‌ (Rajiv Aggarwal)తో సహా పలువురు ఇతర ఉన్నతాధికారులు కంపెనీ నుంచి వైదొలిగిన వెంటనే చోలేట్టి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల, మెటా ఇండియా చీఫ్ అజిత్ మోహన్ కూడా పోటీదారు స్నాప్‌ (Snap)లో జాయిన్ అయ్యారు. బోస్ తన రాజీనామాను ప్రకటించిన తర్వాత వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ (Cathcart) అతని అద్భుతమైన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లో మొదటి వాట్సాప్ హెడ్‌గా అభిజిత్ బోస్ చేసిన అద్భుతమైన సహకారానికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. మిలియన్ల మంది యూజర్లు, ఇతర వ్యాపారాలకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. భారత్‌లో వాట్సాప్ చేయాల్సిన సేవలు ఇంకా చాలా ఉన్నాయని, అదే భారత్ డిజిటల్ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడంలో సాయపడుతుందని అని క్యాత్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీకి ఇప్పుడు దేశంలోని వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా ఉన్న శివనాథ్ తుక్రాల్ నాయకత్వం వహిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Live Location on WhatsApp : మీ వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!