Mobile Phone Users : భారత్‌లో 1.2 బిలియన్లకుపైనే మొబైల్ ఫోన్ యూజర్లు.. నివేదికలో వెల్లడి!

Mobile Phone Users : ప్రతిఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు కామన్ అయిపోయాయి. మొబైల్ ఫోన్ లేని ఇల్లే ఉండదు. ప్రతి ఇంట్లో ఎవరి ఒకరి దగ్గర మొబైల్ ఫోన్ తప్పక ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో తక్కువ ధరకే మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి.

Mobile Phone Users : భారత్‌లో 1.2 బిలియన్లకుపైనే మొబైల్ ఫోన్ యూజర్లు.. నివేదికలో వెల్లడి!

India has over 1.2 bn mobile phone users I&B ministry

Mobile Phone Users : ప్రతిఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు కామన్ అయిపోయాయి. మొబైల్ ఫోన్ లేని ఇల్లే ఉండదు. ప్రతి ఇంట్లో ఎవరి ఒకరి దగ్గర మొబైల్ ఫోన్ తప్పక ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో తక్కువ ధరకే మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దాంతో సామాన్యుల దగ్గర నుంచి బిలియనీర్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతమంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారు? స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్లు ఎంతమంది అనేది సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

India has over 1.2 bn mobile phone users I&B ministry

India has over 1.2 bn mobile phone users I&B ministry

భారత్‌లో 1.2 బిలియన్లకు పైగా మొబైల్ ఫోన్ యూజర్లు, 600 మిలియన్ల స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. తక్కువ డేటా రేట్‌లతో పాటు, స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్లు మొబైల్ డివైజ్‌ల ద్వారా అధిక మొత్తంలో డేటాను వినియోగిస్తున్నారని సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. దేశంలో సోషల్ మీడియా సమాచారాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో జరిగిన మొదటి ప్రపంచ మీడియా కాంగ్రెస్‌లో కార్యదర్శి ప్రసంగించారు. ఈ సందర్భంగా అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొలిసారిగా ఇలాంటి కాంగ్రెస్‌ను నిర్వహించినందుకు అభినందించారు. ఆతిథ్య దేశంతో భారత్‌కు చాలా పోలికలు ఉన్నాయని ఆయన అన్నారు.

India has over 1.2 bn mobile phone users I&B ministry

India has over 1.2 bn mobile phone users I&B ministry

భారత్‌లోని మీడియా ల్యాండ్‌స్కేప్ గురించి అక్కడ వారందరికి వివరించారు. భారత్ 897 టెలివిజన్ ఛానెల్‌లను కలిగిన సంప్రదాయ మీడియాతో కూడిన దేశమని ఆయన చాటిచెప్పారు. వాటిలో 350కి పైగా న్యూస్ ఛానెల్‌లు, 80వేలకు పైగా వార్తాపత్రికలు వివిధ భాషలలో ఉన్నాయని తెలిపారు. అయితే, ఇటీవల ఈ కొత్త మీడియా నుంచి సమాచారాన్ని వినియోగిస్తున్న యువకులు కొత్త మార్గాల్లో పయనిస్తున్నారని, అది కాస్తా విశ్వసనీయతకు, ప్రభుత్వానికి సవాలుగా ఉందని కార్యదర్శి అన్నారు. ఈ దృగ్విషయానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మార్గాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : DoT SMS Rule : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు కొత్త SMS రూల్.. ఇక ఎస్ఎంఎస్ ఫ్రాడ్‌కు చెక్ పడినట్టే..!