India To Ban Smartphones : చైనా బ్రాండ్‌లలో రూ.12వేల లోపు స్మార్ట్‌ఫోన్లను భారత్ బ్యాన్ చేయనుందా? కేంద్రం క్లారిటీ..!

India To Ban Smartphones : చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు (China Smartphone Companies) చివరకు ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే, భారత్‌లో ప్రస్తుతం రూ. 12వేల లోపు ఫోన్‌ల అమ్మకాలను నిషేధించే ప్రణాళిక లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

India To Ban Smartphones : చైనా బ్రాండ్‌లలో రూ.12వేల లోపు స్మార్ట్‌ఫోన్లను భారత్ బ్యాన్ చేయనుందా? కేంద్రం క్లారిటీ..!

India to ban smartphones under Rs 12,000 from Chinese brands Govt clarifies

India To Ban Smartphones : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయనుందా? భారత మార్కెట్లో పాపులర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు అయిన Oppo, Vivo, Xiaomi సహా ఇతర చైనా స్మార్ట్ ఫోన్లపై కేంద్రం బ్యాన్ చేయబోతుందా? అంటే అలాంటి పరిస్థితులే కనిపించడం లేదు. కానీ, కొన్నిరోజులుగా చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో రూ.12వేల లోపు స్మార్ట్ ఫోన్లపై భారత్ బ్యాన్ చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు (China Smartphone Companies) చివరకు ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే, భారత్‌లో ప్రస్తుతం రూ. 12వేల లోపు ఫోన్‌ల అమ్మకాలను నిషేధించే ప్రణాళిక లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. నివేదికల ప్రకారం.. భారత్ నుంచి ఎగుమతులను పెంచాలని కేంద్రం స్మార్ట్‌ఫోన్ తయారీదారులను కోరింది. అలాగే, రూ. 12వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలను నిషేధించే ప్రతిపాదనలు లేవని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.

దేశ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో భారతీయ కంపెనీలు (Indian Smartphone Companies) కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ… భారతీయ కంపెనీలకు మార్గం కల్పించేందుకు విదేశీ బ్రాండ్‌లను మినహాయించాలనే అర్థం కాదని ఐటీ మంత్రి స్పష్టం చేశారు. ‘కొన్ని చైనీస్ బ్రాండ్‌లతో ఏకైక సమస్య ఏమిటంటే.. ఆ దేశ కంపెనీలే ఎక్కువ ఎగుమతులు చేస్తారనేది అంచనా మాత్రమే. చైనాకు సంబంధించిన సప్లయ్ చైన్, స్పేర్ పార్టులు, మరింత పారదర్శకంగా అందించేందుకు బహిరంగంగా ఉండాలి. (Online) మార్కెట్‌లోని నిర్దిష్ట సెగ్మెంట్ (Sub-రూ. 12వేలు) నుంచి బయటకు తీసుకురావడమే దాని ఉద్దేశం.. ప్రస్తుతానికి నిషేధంపై ఎలాంటి ప్రతిపాదన లేదు’ అని మంత్రి రాజీవ్ క్లారిటీ ఇచ్చారు.

India to ban smartphones under Rs 12,000 from Chinese brands Govt clarifies

India to ban smartphones under Rs 12,000 from Chinese brands Govt clarifies

అంతకుముందు, రిలయన్స జియో (Reliance Jio), లావా (Lawa), మైక్రోమ్యాక్స్ (Micromax), ఇతర స్వదేశీ బ్రాండ్‌ల అమ్మకాలను పెంచడానికి భారత్‌లో రూ. 12వేల లోపు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్ నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోందని నివేదిక తెలిపింది. అయితే, ప్రస్తుతానికి ఆ తరహా అభ్యర్థలను ప్రభుత్వం తిరస్కరించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం భారత్‌లో సబ్-12వేల విభాగంలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం చైనీస్ కంపెనీలపై నిఘా పెట్టింది. ఈ మధ్య కాలంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల ఆఫీసులపై దాడులు జరిగాయి.

Oppo, Xiaomi లపై ఇటీవలి దాడులు కూడా జరిగాయి. ఆయా కంపెనీలపై పన్ను ఎగవేత వంటి అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో భారత ప్రభుత్వం 2020లో దాదాపు 50 చైనీస్ యాప్‌లను నిషేధించింది. బ్యాన్ చేసిన యాప్‌లలో TikTok, PUBG సహా పలు యాప్స్ ఉన్నాయి.

PUBG భారత్‌లో మరో పేరుతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ప్రభుత్వం Google, Appleని బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) యాప్ లేదా PUBG మొబైల్ భారతీయ వెర్షన్‌ను ప్లే స్టోర్ నుంచి అలాగే ఆపిల్ (Apple App Store) యాప్ స్టోర్ నుండి తొలగించాలని ఆదేశించింది. భారత్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ యాప్ ఇకపై అందుబాటులో ఉండదనే చెప్పాలి.

Read Also : iPhone 14 : ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఇచ్చినా కొనొద్దు.. అదిరే ఫీచర్లతో చౌకైన ధరకే iPhone 14 వస్తోంది.. డోంట్ మిస్..!