Malware Remove Tool : మీ ఫోన్‌లో మాల్‌వేర్ తొలగించే పవర్‌ఫుల్ టూల్ ఇదిగో.. ప్రభుత్వం ఫ్రీగా అందిస్తోంది.. ఎలా డౌన్‌లోడ్ చేసి వాడాలో తెలుసా?

Malware Remove Tool : భారత ప్రభుత్వ సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ మొబైల్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఫ్రీ బోట్ రిమూవల్ టూల్స్‌ తీసుకొచ్చింది. ఈ టూల్ సాయంతో ఫోన్లలో మాల్వేర్‌లను స్కాన్ చేయడంతో పాటు తొలగించేందుకు సాయపడుతుంది.

Malware Remove Tool : మీ ఫోన్‌లో మాల్‌వేర్ తొలగించే పవర్‌ఫుల్ టూల్ ఇదిగో.. ప్రభుత్వం ఫ్రీగా అందిస్తోంది.. ఎలా డౌన్‌లోడ్ చేసి వాడాలో తెలుసా?

Indian govt offering free tool to remove malware from your phone

Malware Remove Tool : భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ మొబైల్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త పవర్‌ఫుల్ టూల్ ప్రవేశపెట్టింది. ఈ టూల్ ద్వారా వినియోగదారుల మొబైల్ ఫోన్ల నుంచి మాల్వేర్‌లను స్కాన్ చేయడంతో పాటు తొలగించడంలో సాయపడుతుంది. అదే.. ఫ్రీ బోట్ రిమూవల్ టూల్ (Free Bot Removal Tool) అందిస్తోంది. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న మాల్వేర్ దాడులు, స్కామ్‌లతో డివైజ్ సెక్యూరిటీపై ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తమ స్మార్ట్‌ఫోన్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) అనేక ఉచిత బోట్ రిమూవల్ టూల్స్‌ను తీసుకొచ్చింది.

ఈ టూల్స్ గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కూడా SMS నోటిఫికేషన్‌ల ద్వారా యూజర్లను అలర్ట్ చేస్తోంది. ఇటీవల, ప్రభుత్వం నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వైరల్ అవుతోంది. ‘సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉండండి.. బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్లు, మాల్వేర్ నుంచి మీ డివైజ్ ప్రొటెక్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం, CERT-In ద్వారా, ‘ఉచిత బాట్ రిమూవల్ టూల్’ని డౌన్‌లోడ్ చేయమని (csk.gov.in) సిఫార్సు చేస్తోంది. ఈ SMS వినియోగదారులకు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది. బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్లు, మాల్వేర్ థ్రెట్స్ నుంచి తమ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ బోట్‌నెట్ టూల్ ప్రభుత్వం అందించిన ఈ ఫ్రీ టూల్స్ ఎవరైనా ఎక్కడ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు.

సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ అంటే ఏమిటి? :
ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఎవరైనా వ్యక్తులు ఇప్పుడు సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ ద్వారా ఉచిత మాల్వేర్ డిటెక్షన్ టూల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. బోట్‌నెట్ క్లీనింగ్, మాల్వేర్ అనాలిసిస్ సెంటర్ అని కూడా పిలుస్తారు. ఈ పోర్టల్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నిర్వహణలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISPలు), యాంటీవైరస్ కంపెనీల సహకారంతో పనిచేస్తుంది. వెబ్‌సైట్ యూజర్లకు వారి సిస్టమ్‌లు/డివైజ్‌లను సురక్షితంగా ఉంచడానికి సమాచారం, టూల్స్ అందిస్తుంది. భారత్‌లో బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్‌లను చురుకుగా గుర్తించడం ద్వారా సురక్షితమైన సైబర్‌స్పేస్‌ను అందించడమే ప్రాథమిక లక్ష్యంగా పనిచేస్తోంది.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

బోట్‌నెట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? :
బోట్‌నెట్ అనేది స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్‌ల వంటి ‘Bot’ అనే మాల్‌వేర్‌తో ఇన్ఫెక్ట్ అయిన డివైజ్ నెట్‌వర్క్. ఈ డివైజ్ బోట్‌నెట్‌ ద్వారా మాల్వేర్ ఇంజెక్ట్ అయిన కంప్యూటర్‌లపై హ్యాకర్‌లకు కంట్రోల్ ఇస్తుంది. స్పామ్ మెసేజ్ పంపడం, అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ టెక్స్ట్‌లు, ఫేక్ కాల్స్ చేయడం, నెట్ బ్యాంకింగ్ వివరాలు, యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌ల వంటి రహాస్య సమాచారాన్ని యాక్సెస్ చేయడం వంటి వివిధ హానికరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి హ్యాకర్లకు కంట్రోల్ అందిస్తుంది.

మీరు ఇలా చేస్తే.. మీ డివైజ్ బాట్ ద్వారా ఇన్ఫెక్ట్ అయినట్టే.. :

* బాట్ ఇన్ఫెక్ట్ అయిన అటాచ్‌మెంట్‌ను ఈ-మెయిల్‌లో ఓపెన్ చేసినప్పుడు..
* ఈ-మెయిల్ లేదా వెబ్‌సైట్‌లో హానికరమైన లింక్‌పై క్లిక్ చేసినప్పుడు..
* అవిశ్వసనీయ సోర్స్ నుంచి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు..
* సేఫ్ కాని పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగించినప్పుడు..

Indian govt offering free tool to remove malware from your phone

Indian govt offering free tool to remove malware from your phone

మాల్వేర్, బోట్‌నెట్‌లను ఎలా తొలగించాలంటే? :
మీ డివైజ్‌కు బోట్‌నెట్ వ్యాపించిందా లేదో చెక్ చేయడానికి లేదా బాట్‌లు, మాల్వేర్‌లను తొలగించండి.

CSK వెబ్‌సైట్‌కి వెళ్లండి.. www.csk.gov.in/
* ‘సెక్యూరిటీ టూల్స్’ ట్యాబ్‌పై Click చేయండి.
* మీరు ఉపయోగించే బాట్ రిమూవల్ టూల్ యాంటీవైరస్ కంపెనీని ఎంచుకోండి.
* టూల్ డౌన్‌లోడ్ చేయడానికి ‘డౌన్‌లోడ్’ బటన్‌పై క్లిక్ చేయండి.

విండోస్ యూజర్ల కోసం : eScan యాంటీవైరస్, K7 సెక్యూరిటీ లేదా క్విక్ హీల్ వంటి ఉచిత బోట్ రిమూవల్ టూల్స్‌లో ఒకదానిని డౌన్‌లోడ్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం : Google Play Storeకి వెళ్లండి. ‘eScan CERT-IN Bot Removal’ టూల్ లేదా C-DAC హైదరాబాద్ అభివృద్ధి చేసిన ‘M-Kavach 2’ కోసం సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ డివైజ్‌లో రన్ చేయండి. యాప్ మీ డివైజ్‌లోని మాల్వేర్‌ను స్కాన్ చేస్తుంది. ఏవైనా ఇన్ఫెక్షన్‌లు గుర్తిస్తే.. వెంటనే వాటిని తొలగిస్తుంది. బోట్ రిమూవల్ టూల్స్ కాకుండా, CSK పోర్టల్ ‘USB Pratirodh’ ‘AppSamvid’ వంటి ఇతర భద్రతా అప్లికేషన్‌లను కూడా అందిస్తుంది. వినియోగదారులు తమ భద్రతను పెంచుకోవడానికి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

‘USB Pratirodh’ అనేది ఫోన్‌లు, పెన్ డ్రైవ్‌లతో సహా డిలీట్ చేయడం ద్వారా స్టోరేజ్ మీడియా వినియోగాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇదో డెస్క్‌టాప్ టూల్. ఈ కొత్త USB డివైజ్ కనెక్ట్ చేసిన తర్వాత యూజర్లుఅథెంటికేషన్ ప్రయోజనాల కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. అదనంగా, ఈ టూల్ USB డివైజ్‌లోని మాల్వేర్ కోసం స్కాన్ చేసి డేటాను సింకరైజ్ చేస్తుంది.

ఫోన్ యాక్సస్ అనుమతించే సెట్టింగ్స్ కూడా మార్చేస్తుంది. విండోస్ యూజర్ల కోసం ‘AppSamvid’ టూల్ అందుబాటులో ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫైల్‌లను మాత్రమే అమలు చేసే అప్లికేషన్ ఇది. నమ్మదగిన ఎక్జిక్యూటబుల్స్ జావా ఫైల్‌ల జాబితాలను క్రియేట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. యూజర్‌లు యాప్‌ను పాస్‌వర్డ్‌తో కూడా సేఫ్టీగా ఉంచుకోవచ్చు. ‘AppSamvid’ వైరస్‌లు, ట్రోజన్‌లు, ఇతర మాల్‌వేర్‌ల నుంచి సిస్టమ్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది.

Read Also : Realme 11 Pro Launch : రియల్‌మి 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారంతే..!