Instagram: త్వరలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వారూ సంపాదించుకోవచ్చా..

టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫాంలకు బదులుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బాగా ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్ కంపెనీల్లో ఒకటైన ఇన్‌స్టా బోనస్ ఫీచర్ ను తీసుకురానుందట.

Instagram: త్వరలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వారూ సంపాదించుకోవచ్చా..

Instagram Reels

Instagram: టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ఎంటర్‌టైన్మెంట్ ప్లాట్‌ఫాంలకు బదులుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ బాగా ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్ కంపెనీల్లో ఒకటైన ఇన్‌స్టా బోనస్ ఫీచర్ ను తీసుకురానుందట. దీని ద్వారా రీల్స్ క్రియేట్ చేసేవారికి డబ్బులు కూడా సంపాదించే అవకాశం దక్కుతుంది.

డెవలపర్ అలెస్సాండ్రో పాలుజ్జీ ఈ ఫీచర్ ను ముందుగా గుర్తించారు. రీల్స్ క్రియేట్ చేసే వారికి మాత్రమే బోనస్ ఇవ్వాలనుకోగా.. రెగ్యూలర్ యూజర్లకు ఇవ్వాలని అనుకోవడం లేదు. స్క్రీన్ షాట్లను బట్టి క్రియేటర్లు కొత్త రీల్స్ అప్ లోడ్ చేసే సమయంలో మనీ చెల్లిస్తుంది.

ఇది కేవలం రూమర్ మాత్రమేనని కంపెనీ ఇప్పటివరకూ కొట్టిపారేయలేదు. కాకపోతే మనీ చెల్లించడం అనేది మానిటైజ్ అయిన విషయంపై ఆధారపడి ఉంటుంది. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ను బట్టి డబ్బులు చెల్లించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ లోనే ఉందని ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. త్వరలోనే కంపెనీ Insights ఫీచర్ ను తీసుకొచ్చి యూజర్ల కోసం పర్ ఫార్మెన్స్ చెక్ చేసుకునే వెసలుబాటు కల్పించనుంది.