iPhone 14 Series Pre-Order : ఈ సాయంత్రం నుంచే కొత్త ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు.. ఇలా ఆర్డర్ చేసుకోండి.. ఇండియాలో ధరలు ఇవే..!

iPhone 14 Series Pre-Order : ఈ సాయంత్రం నుంచే ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు.. కొత్త ఐఫోన్ ఇలా ఆర్డర్ చేసుకోండి.. ఇండియాలో ధరలు ఇవే..!

iPhone 14 Series Pre-Order : ఈ సాయంత్రం నుంచే కొత్త ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు.. ఇలా ఆర్డర్ చేసుకోండి.. ఇండియాలో ధరలు ఇవే..!

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

iPhone 14 Series Pre-Order : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రవేశపెట్టిన ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series Launch) గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగల వినియోగదారులకు ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) ఈరోజు (సెప్టెంబర్ 10) నుంచి ప్రీ-ఆర్డర్‌ (iPhone 14 Series Pre-Order) కోసం అందుబాటులో ఉండనుంది. ఆపిల్ iPhone 14 కొత్త డివైజ్ లాంచ్ అయిన రెండు రోజులకే ప్రీ-ఆర్డర్ మొదలైంది.

ఈరోజు (శనివారం) సాయంత్రం 5:30PMకి ప్రీ-ఆర్డర్ సేల్ మొదలవుతుంది. అయితే, అన్ని iPhoneలు ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉండవని గమనించాలి. ఆపిల్ 4 ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేసింది. అయితే iPhone 14 Plus వేరియంట్ ఈరోజు ప్రీ-ఆర్డర్ సేల్ లో అందుబాటులో ఉండదు. ముందుగా ఆసక్తిగల వినియోగదారులు iPhone 14, iPhone 14 Pro లేదా iPhone 14 Pro Maxని మాత్రమే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు Apple అధికారిక ఆన్‌లైన్ స్టోర్ (Apple Online Store) ఇతర థర్డ్-పార్టీ స్టోర్‌ల ద్వారా కొత్త iPhoneలను ఆర్డర్ చేయవచ్చు.

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), క్రోమా (Croma), విజయ్ సేల్స్ (Vijay Sales), రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) భారత మార్కెట్లో రూ. 79,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లతో కొంచెం తక్కువ ధరకు కొత్త ఐఫోన్ మోడళ్లను సొంతం చేసుకోవచ్చు. మీరు కొత్త iPhone 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

గత ఏడాదిలో ఐఫోన్ మోడల్‌ (iPhone 13)ను కొనుగోలు చేయండి. ఆపిల్ కొత్త మోడల్ iPhone 13 మాదిరిగానే ఉంటుంది. 2021 మోడల్ దాదాపు రూ. 70వేలకు అందుబాటులో ఉంది. ఆఫర్ల విషయానికి వస్తే.. లేటెస్ట్ iPhone 14 సిరీస్ కొనుగోలుపై రూ. 6,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై వర్తిస్తుంది. అన్ని కొత్త ఐఫోన్‌ల ధరపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో iPhone 14 ధర ఎంతంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 (128GB స్టోరేజ్) ధర రూ.79,900గా నిర్ణయించింది. మీకు 128GB స్టోరేజ్ సరిపోకపోతే మరో రెండు వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. 256GB స్టోరేజ్ మోడల్ రూ.89,900కి అందుబాటులో ఉంటుంది, 512GB కాన్ఫిగరేషన్ ధర రూ.1,09,900గా ఉంది.

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

భారత్‌లో iPhone 14 Pro ధర ఎంతంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 ప్రోను భారత మార్కెట్లో 128GB స్టోరేజ్ మోడల్ రూ. 1,29,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. 256GB, 512GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 1,39,900, రూ. 1,59,900గా ఉన్నాయి. 1TB స్టోరేజ్ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే రూ.1,79,900 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే Pro Models డీప్ పర్పుల్, గోల్డ్, సిల్వర్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

iPhone 14 series will be up for pre-order today at 5_30PM_ Check out India prices

భారత్‌లో iPhone 14 Pro Max ధర ఎంతంటే? :
iPhone 14 Pro Max ప్రారంభ ధర 128GB స్టోరేజ్ రూ. 1,39,900గా నిర్ణయించింది. 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,49,900గా ఉంటే.. 512GB కాన్ఫిగరేషన్ ధర రూ. 1,69,900గా ఉంది. 1TB మోడల్ రూ. 1,89,900 ధర ట్యాగ్‌తో సేల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మోడల్ గోల్డ్, సిల్వర్, స్పేస్ బ్లాక్, డీప్ పర్పుల్ కలర్ ఆప్షన్లతో సేల్ అందుబాటులో ఉంది.

Read Also : iPhone 14 Price in India : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర.. విదేశాల్లో కన్నా భారత్‌లోనే ఎక్కువ.. ఏయే దేశాల్లో చౌకైన ధరకే లభిస్తుందో తెలుసా? ఇదిగో లిస్ట్..!