IPL 2023 Live Stream : మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను 4Kలో ఫ్రీగా చూడొచ్చు.. మీకు నచ్చిన భాషలోనే..!

IPL 2023 Live Stream : అతి త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ప్రారంభం కానుంది. ఐపీఎల్ లీగ్ మొదటి మ్యాచ్ మార్చి 31న జరగనుంది. అయితే, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

IPL 2023 Live Stream : మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను 4Kలో ఫ్రీగా చూడొచ్చు.. మీకు నచ్చిన భాషలోనే..!

IPL 2023 Live Stream _ IPL 2023 will stream in 4K resolution for free on JioCinema

IPL 2023 Live Stream : అతి త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ప్రారంభం కానుంది. ఐపీఎల్ లీగ్ మొదటి మ్యాచ్ మార్చి 31న జరగనుంది. అయితే, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్రత్యేకించి జియో యూజర్ల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) కూడా IPL క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తోంది. (JioCinema) యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నట్టు జియో ధృవీకరించింది. ఐపీఎల్ అభిమానులు తమ ఫేవరెట్ జట్టు మ్యాచ్‌లను 4K రిజల్యూషన్‌లో (UltraHD) ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లను చూడవచ్చు.

రిలయన్స్ జియో హై-రిజల్యూషన్‌లో కంటెంట్‌ను ఉచితంగా అందించనుంది. ఇప్పటివరకు, భారత్‌లో IPL మ్యాచ్‌లను వీక్షించేందుకు వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతానికి ఈ సబ్‌స్ర్కిప్షన్ అందరికీ అందుబాటులో లేదు. కాకపోతే.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) వంటి టెలికాం ఆపరేటర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించాయి. ఈ సభ్యత్వంపై అదనపు ఖర్చు లేకుండా IPL మ్యాచ్‌లను చూసేందుకు అనుమతించాయి. కానీ, ఇప్పుడు, జియోసినిమా (JioCinema) యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను హైరిజల్యూషన్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.

Read Also : IPL 2023 Schedule: మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచులో తలపడనున్న గుజరాత్, చెన్నై

ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. FIFA వరల్డ్ కప్ 2022 Multicam ఫీచర్‌ని చూసిన వారికి జియోసినిమా యాప్ గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. జియోసినిమా యాప్ అధిక లోడ్‌ను నిర్వహించలేక పోవడంతో చాలా మందికి మొదటి రోజు FIFA ప్రపంచ కప్‌ను ప్రసారం చేయడంలో అనేక సమస్యలు ఉన్నాయి.

IPL 2023 Live Stream _ IPL 2023 will stream in 4K resolution for free on JioCinema

IPL 2023 Live Stream _ IPL 2023 will stream in 4K resolution for free on JioCinema

ఐపీఎల్ మ్యాచ్ మొదటి రోజు వినియోగదారులు లాగ్, ఫ్రీజింగ్ సమస్యలను ఎదుర్కొన్నారు. జియోసినిమా APPలో 12 విభిన్న భాషల్లో IPL మ్యాచ్‌లను చూసేందుకు టెలికాం కంపెనీ తమ వినియోగదారులకు అనుమతిస్తుంది. అందులో ఇంగ్లీష్, తమిళం, హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి వంటి మరిన్ని భాషలు ఉన్నాయి. దీంతో పాటు, మీరు మ్యాచ్‌ల భాషను మార్చినట్లయితే.. జియోసినిమా యాప్ టెక్స్ట్ మార్చడమే కాకుండా గణాంకాలు, గ్రాఫిక్స్‌లో మార్పులను గమనించవచ్చు.

రిలయన్స్ జియో (Reliance Jio) దాదాపు 277 భారతీయ నగరాల్లో 5G సర్వీసులను విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. 5G కనెక్టివిటీ ఇప్పటికీ స్థిరంగా అందుబాటులో ఉన్నప్పటికీ.. అనేక మంది వినియోగదారులు కాల్ డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. 5G డేటాను చాలా వేగంగా యాక్సస్ చేసుకోవడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే జీరో డేటాకు చేరుతుందని ఫిర్యాదులు అందాయి. టెలికాం కంపెనీ 5G ప్లాన్‌లను ఇంకా వెల్లడించలేదు. టెలికం కంపెనీలు దేశవ్యాప్తంగా 5Gని విజయవంతంగా రిలీజ్ చేసిన తర్వాత 5G ప్లాన్‌లను రివీల్ చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ నెట్‌వర్క్ జియో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డేటాను హరించడంతో మెరుగైన డేటా ప్లాన్‌లను అందించాలని భావిస్తోంది.

Read Also : Jio – Airtel 5G Data Plans : జియో – ఎయిర్‌టెల్ 5G ప్లాన్లు ఇవే.. ఈ ప్లాన్లపై 3GB డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!