iQOO 11 First Sale in India : iQOO 11 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

iQOO 11 First Sale in India : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌‌గా పేరొందిన iQOO 11 రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.

iQOO 11 First Sale in India : iQOO 11 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

iQOO 11 first sale in India today _ Price, specifications and everything you need to know

iQOO 11 First Sale in India : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌‌గా పేరొందిన iQOO 11 రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. Qualcomm ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, Snapdragon 8 Gen 2 ఆధారితమైన iQOO 11 స్మార్ట్‌ఫోన్ జనవరి 13 నుంచి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లతో పాటు అత్యుత్తమ పనితీరును అందించే iQOO 11 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలో మొదటి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది.

ఐక్యూ 11 ధర ఎంతంటే? :
iQOO 11 ఫోన్ ధర భారత మార్కెట్లో 8GB+256GB వేరియంట్ రూ. 59,999గా ఉంది. అయితే 16GB+256GB ధర రూ. 64,999తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో వరుసగా రూ.51,999, రూ.56,999కి కొనుగోలు చేయవచ్చు. జనవరి 12న ప్రారంభమైన ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్‌ (Prime Early Access Sale)లో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ (Amazon Prime Members)లు రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Read Also : iQOO 9 SE Discount : అమెజాన్‌లో ఐక్యూ 9 SE ఫోన్‌, రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏది బెటర్ అంటే?

అదేవిధంగా, నాన్-ప్రైమ్ యూజర్లు ఈ డివైజ్‌ను అమెజాన్, iQOO స్టోర్‌లలో జనవరి 13 నుంచి కొనుగోలు చేయవచ్చు. iQOO 11 రెండు కలర్ ఆప్షన్లలో లెజెండ్, ఆల్ఫా వేరియంట్‌లతో అందుబాటులో ఉంది.

iQOO 11 స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐక్యూ 11 ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 2K E6 ప్యానెల్‌ విభాగంలో స్మార్ట్‌ఫోన్ మొదటిది. ఈ డివైజ్ Qualcomm Snapdragon 8 Gen 2తో వచ్చింది. గరిష్టంగా 16GB RAMతో వచ్చింది. అదనంగా, వర్చువల్ ర్యామ్‌ను 8GB వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజ్‌తో 8GB వేరియంట్‌లో కూడా వస్తుంది.

iQOO 11 first sale in India today _ Price, specifications and everything you need to know

iQOO 11 first sale in India today _ Price, specifications

కెమెరా విభాగంలో, iQOO 11 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-MP Samsung GN5 లెన్స్, 13-MP టెలిఫోటో లెన్స్, 8-MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, స్పాట్‌లెస్ సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు 16-MP స్నాపర్ కూడా ఉంది. ఆసక్తికరంగా, iQOO 11 ప్రత్యేకమైన V2 ఇమేజింగ్ చిప్‌తో వచ్చింది.

తక్కువ-కాంతి ఫోటోగ్రఫీతో పాటు స్మార్ట్‌ఫోన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. V2 చిప్ ఫ్రేమ్ రేటును పెంచుతుంది. తక్కువ శక్తిని వినియోగిస్తుంది. iQOO 11 గేమింగ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరిచే డ్యూయల్ x-లీనియర్ మోటార్‌ను కూడా కలిగి ఉంది. iQOO 11 బ్యాటరీకి 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 15 Pro Models : భారీ ధరలతో రానున్న ఐఫోన్ 15 ప్రో మోడల్స్.. కొత్త ఐఫోన్లలో ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!