Tax రిఫండ్ కాలేదా? : ITR ఫైలింగ్ Verify చేయడం మరవద్దు

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ చేశారా? ఆగస్టు 31తో గడువు తేదీ ముగిసింది. ముందుగానే ట్యాక్స్ రిటర్స్స్ ఫైల్ చేశాం.

  • Published By: sreehari ,Published On : September 9, 2019 / 11:55 AM IST
Tax రిఫండ్ కాలేదా? : ITR ఫైలింగ్ Verify చేయడం మరవద్దు

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ చేశారా? ఆగస్టు 31తో గడువు తేదీ ముగిసింది. ముందుగానే ట్యాక్స్ రిటర్స్స్ ఫైల్ చేశాం.

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ చేశారా? ఆగస్టు 31తో గడువు తేదీ ముగిసింది. ముందుగానే ట్యాక్స్ రిటర్స్స్ ఫైల్ చేశాం. పని అయిపోయింది అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ ఐటీ రిటర్స్స్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. ట్యాక్స్ రిఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది. అదేంటీ ఐటీ రిటర్స్స్ ఫైల్ చేశాం కదా? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రిటర్స్స్ ఫైల్ చేశాక.. మీరు వెరిఫై చేసేంతవరకు ఐటీ శాఖ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తి చేయదు. ఎప్పుడైతే మీరు వెరిఫై చేసుకుంటారో అప్పుడే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఆ తర్వాతే మీ రిటర్స్స్ రిఫండ్ మొత్తం తిరిగి క్రెడిట్ అవుతుంది. సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక 120 రోజుల్లోగా మీ ఐటీఆర్ రిటర్న్ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. 

ఎంత తొందరగా వెరిఫై చేసుకుంటే అంత తొందరగా రిఫండ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పుడు మాత్రమే రిఫండ్ అమౌంట్ వస్తుంది. లేదంటే.. మీకు రావాల్సిన రిఫండ్ రిటర్న్ వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖకు ఐటీఆర్ ఫైలింగ్ 5.65 కోట్లు వరకు నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2018-19లో 5.42 కోట్ల ఐటీఆర్ దాఖలు అయ్యాయి. సెప్టెంబర్ 1, 2019 వరకు 3.61 కోట్లు ఐటీఆర్స్ మాత్రమే వెరిఫై అయ్యాయి. మీ రిటర్న్ దరఖాస్తును ఫ్రింట్ తీసి CPC, బెంగళూరుకు పోస్టు ద్వారా పంపవచ్చు. లేదా ఈ-వెరిఫై చేసుకునే అవకాశం ఉంది. మీ రిటర్స్స్ ఈ-వెరిఫై చేసుకునేందుకు ఎన్నో దారులు ఉన్నాయి.  ITR ఈ-వెరిఫై చేసుకోవాలంటే ఆధార్ నెంబర్ ఆధారిత OTPతో చేసుకోవచ్చు. నెట్ బ్యాకింగ్, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా నేరుగా ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్లో మీ రిటర్న్స్ అకౌంట్ ద్వారా లాగిన్ కావొచ్చు. 

మీ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్స్ ఫైలింగ్ లో ఏదైనా లోపం లేదా తప్పు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే.. రివైజ్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు తేదీలోగా రిటర్న్ ఫైల్ చేసిన వారికి ఒకసారి మాత్రమే రివైజ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రివైజ్ రిటర్న్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు రివైజ్ రిటర్న్ ఫైల్ చేసేందుకు రెండేళ్ల సమయం ఉండేది. ఇటీవల రెండేళ్ల కాలాన్ని ఒక ఏడాదికి తగ్గించారు. ఆయా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే.. వార్షిక సంవత్సరం 2019-20 (FY 2018-19) మార్చి 31, 2020 నాటికి రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రివైజ్ రిటర్న్ ఫైల్ చేశాక వెరిఫై చేయడం అసలు మరవద్దు. 

వెరిఫై చేశాక మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ట్యాక్స్ రిఫండ్ క్లయిమ్ గురించి ట్రాక్ చేసుకునేందుకు సంబంధిత వివరాలను భద్రపరుచుకోవాలి. రిఫండ్ రిటర్న్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న అయ్యంకర్ సంపర్క్ కేంద్ర టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-1961 లేదా ఈమెయిల్ refunds@incometaxindia.gov.in ద్వారా సంప్రదించాల్సి ఉంటుంది. రిఫండ్ సంబంధింత సమస్య లేదా ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే రిఫండ్ రికార్డును CPC, బెంగళూరు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2229 లేదా 080-43456700లో సంప్రదించాలి. పేమెంట్ సంబంధిత సందేహాల కోసం పన్నుదారులు SBI కాంటాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-976లో సంప్రదించాల్సి ఉంటుంది.