Space News: భూమి నుంచి 10 లక్షల కి.మీ దూరంలో పార్కింగ్ చేసుకున్న “జేమ్స్ వెబ్” టెలీస్కోప్

అంతరిక్షంలోని సుదూర గ్రహాలను, పాలపుంతలను వీక్షించి..విశ్వం గుట్టు తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ "నాసా" ప్రయోగించిన "జేమ్స్ వెబ్" టెలీస్కోప్ మరో ముందడుగు వేసింది.

Space News: భూమి నుంచి 10 లక్షల కి.మీ దూరంలో పార్కింగ్ చేసుకున్న “జేమ్స్ వెబ్” టెలీస్కోప్

Nasa

Space News: అంతరిక్షంలోని సుదూర గ్రహాలను, పాలపుంతలను వీక్షించి..విశ్వం గుట్టు తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ “నాసా” ప్రయోగించిన “జేమ్స్ వెబ్” టెలీస్కోప్ మరో ముందడుగు వేసింది. విశ్వంలో దాదాపు నెల రోజుల పాటు ప్రయాణించి 10 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూకక్ష్య నుంచి సుదూరంగా నిర్దిష్టించిన 2వ లాగ్‌రేంజ్ పాయింట్(L2) గమ్యస్థానానికి చేరుకుంది. అక్కడి నుంచి సూర్యుని చుట్టూ పరిబ్రమించనుంది. ఈమేరకు NASA అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “Webb, welcome home!” అంటూ అభినందనలు పంచుకున్నారు.

Also read: Somu Veerraju: జీతాలు ఇవ్వలేని పరిస్ధితిలో వైసీపీ ప్రభుత్వం: సోము వీర్రాజు

2021 డిసెంబర్ లో ప్రయోగించిన ఈ “జేమ్స్ వెబ్” టెలీస్కోప్.. జనవరి మొదటి వారంలో క్షేమంగా మొదట నిర్ధేశించిన లక్ష్యానికి చేరుకొని రెక్కలు విప్పుకుంది. అనంతరం నాసా కంట్రోల్ వ్యవస్థ ద్వారా టెలీస్కోప్ వాహకనౌకలోని థ్రస్ట్ ను పెంచడంతో ప్రస్తుతం L2కి చేరుకొని పార్కింగ్ చేసుకున్నట్లు బిల్ నెల్సన్ తెలిపారు. కాగా మరో ఐదు నెలల తరువాతగానీ ఈ టెలీస్కోప్ తన పని ప్రారంభిస్తుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి టెలీస్కోప్ బాహ్య, అంతర్గత వ్యవహారాలను చక్కబెడుతున్నారు. విశ్వంలోగుట్టును తెలుసుకునేందుకు ఇప్పటి వరకు నాసా ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్ సేవలు అందించింది. 1990లో ప్రయోగించిన హుబుల్ టెలీస్కోప్ మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించి ఖగోళ పరిశోధనలకు ఊతం ఇచ్చింది. ప్రస్తుత “జేమ్స్ టెలీస్కోప్” హబుల్ కంటే 100 రేట్లు శక్తివంతమైనదిగా నాసా పేర్కొంది.

Also read: Srikanth Reddy: మా ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు రకరకాల కుట్రలు