Somu Veerraju: జీతాలు ఇవ్వలేని పరిస్ధితిలో వైసీపీ ప్రభుత్వం: సోము వీర్రాజు

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రోడ్డుమీదకు తెచ్చిందన్నారు

Somu Veerraju: జీతాలు ఇవ్వలేని పరిస్ధితిలో వైసీపీ ప్రభుత్వం: సోము వీర్రాజు

Somu

Somu Veerraju: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్ధిక లేమితో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగస్తులను రోడ్లపై కి తెచ్చిందంటూ సోమువీర్రాజు మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాజ్యసభ ఎంపి సిఎం రమేష్, విష్ణు వర్ధన్ రెడ్డిలు నిరసనలో పాల్గొన్నారు.

Also read: AP Govt Employees : 35 ఏళ్ల తర్వాత సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు

ఈసందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం.. అధికార యంత్రాంగాన్ని రోడ్డుమీదకు తెచ్చిందని విమర్శించారు. ప్రభుత్వానికి ఏ లెక్క ఇవ్వాలన్న అధికార యంత్రాంగమే ఇస్తుందని.. మరి వైసీపీ ప్రభుత్వానికి ఏ గూండాలు లెక్కలు ఇస్తున్నారో అర్ధం కావడం లేదంటూ సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఒప్పందం జరిగాక జీతాలు తగ్గించడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ఇసుక అమ్మితే ప్రభుత్వానికి వంద కోట్లు కూడా రావడం లేదన్న సోమువీర్రాజు.. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇసుకపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు రెవెన్యూ తెస్తామని తెలిపారు. ఆదాయం వనరులన్నీ అధికార పార్టీ నేతలు చేజిక్కించుకుని..ప్రజలందరినీ అప్పుల పాలు చేస్తున్నారని సోమువీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Also read: AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎవరెవరు ఎక్కడికంటే!