JioPhone : జియో నెక్ట్స్ ఫోన్ ధర పెరగనుందా ?

సెల్ ఫోన్ రంగంలో సంచనాలు సృష్టించి ‘జియో’కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా ? ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్ తీసుకరావాలని చూస్తున్న జియోకు కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది

JioPhone : జియో నెక్ట్స్ ఫోన్ ధర పెరగనుందా ?

Jio

Jio Phone Next : సెల్ ఫోన్ రంగంలో సంచనాలు సృష్టించి ‘జియో’కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా ? ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్ తీసుకరావాలని చూస్తున్న జియోకు కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర కేవలం రూ. 5 వేలు ఉండనుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అవసరంగా ఈ ఫోన్ తీసుకరావాలని జియో కంపెనీ భావించింది. అయితే…ఫోన్ లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర పెరగడంతో ఈ ఫోన్ ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More : JioBook Laptop : జియో నుంచి మరో అద్భుతం‌.. స్పెసిఫికేషన్లు ఇవే..!

 

Jio Phone

గూగుల్ – జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ..తాత్కాలికంగా వాయిదా వేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా..ఫోన్ రిలీజ్ చేయాలని భావించారు. ఫోన్ విడుదల వాయిదా వేయడంతో…ధర మరింత పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More : JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?

ఫోన్ లో ఉపయోగించే..సెమీ కండక్టర్లతో సహా..వివిధ భాగాలు ధర సుమారు 20 శాతం పెరిగిందని ఈటి టెలికామ్ రిపోర్టు వెల్లడిస్తోంది. సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుంచి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 5 వేలకు ఈ ఫోన్ వచ్చే అవకాశం లేదంటున్నారు. ధర పెరుగుదల, పూర్తి స్థాయిలో ఫోన్ అందుబాటులోకి వస్తుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. అయితే..ఫోన్ ధరలపై జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది.