JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో స్మార్ట్ ఫోన్ రానున్న సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్‌. 'జియో ఫోన్‌ నెక్ట్స్‌' పేరుతో దీన్ని

JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?

Jiophone Next

JioPhone Next : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో స్మార్ట్ ఫోన్ రానున్న సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్‌. ‘జియో ఫోన్‌ నెక్ట్స్‌’ పేరుతో దీన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. దీనిపై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ‘జియో ఫోన్‌ నెక్ట్స్‌’ అమ్మకాలపై సరికొత్త బిజినెస్‌ మోడల్‌ను అప్లయ్‌ చేయనుంది రిలయన్స్ జియో. ఈ 4జీ జియో ఫోన్‌ను అతి తక్కువ ధరకే అంటే ఫోన్‌ ధరలో పదోవంతుకే వినియోగదారులకు అందివ్వనుందని సమాచారం.

వినాయక చవితి పర్వదినం సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ జరగనుంది. రాబోయే ఆరు నెలల్లో 5 కోట్ల హ్యాండ్‌ సెట్లు అమ్మడం ద్వారా ఏకంగా రూ.10 వేల కోట్ల బిజినెస్‌ చేయాలని రిలయన్స్‌ జియో టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి తగ్గట్టు భారీ స్థాయిలో కొనుగోల్లు జరగాలంటే ఫైనాన్స్‌ సహకారం ఉండటం అవసరం. దీంతో పలు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫోన్‌ ధరలో కేవలం పదిశాతం సొమ్ము చెల్లించి హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా కొనుగోలుదారులు చెల్లించే వీలును కల్పిస్తున్నారు.

Bigg Boss 5 : ఈసారి టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది – ‘కింగ్’ నాగార్జున..

సాధారణంగా ఫైనాన్స్‌ కంపెనీల సాయంతో ఫోన్‌ కొనుగోలు చేయాలంటే ఫోన్‌ ధరలో సగం మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే అలా కాదు. రూ.5వేల ఫోన్‌ ధరపై రూ.500, రూ.7వేల ఫోన్‌ ధరపై రూ.700 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ ధర రూ.5వేలు గానూ, హైఎండ్ వేరియంట్ ధర రూ.7వేలుగా ఉండనుంది.

Karimnagar : రహస్య యాప్ తో భార్య ఫోన్ ట్యాపింగ్

* 4జీ వోల్టే, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నాయి.
* తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు ప్రభావవంతంగా పనిచేయడానికి డ్యుయోగో అనే ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.
* ఇందులో గూగుల్ కెమెరా గో అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం.
* దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1,440 పిక్సెల్స్‌గా ఉండనుంది.
* ఇందులో క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌ను అందించారు.
* ఇది 64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్.
* ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
* దీని బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది.
* బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్పీడీడీఆర్3 ర్యామ్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.